తెలుగు పరిశ్రమ లో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్స్ లో ముందు స్దానంలో ఉంది పూజా హెగ్డె. అల్లు అర్జున్ తో డీజే, ఎన్టీఆర్ తో అరవింద సమేత చిత్రాలు చేసిన ఆమెకు రీసెంట్ గా రిలీజైన మహర్షి సైతం హిట్ అయ్యింది. దాంతో  ఆమె దూకుడుని ఆపగలిగే వాళ్లులేరు. ఓ సినిమా పూర్తి చేయ‌టం ఆల‌శ్యం వెంట‌నే కొత్త సినిమా సెట్ లో అడుగుపెట్టేసే అంత బిజీగా ఉంది.  

అయితే ఆమె దృష్టి ఇక్కడ తెలుగు పరిశ్రమపై లేదు. ఎలాగైనా హిందీలో ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఆమె హిందీలో హృతిక్ రోషన్ సరసన చేసిన మొహంజదారో చిత్రం డిజాస్టర్ అవటంతో ఆమె వెనక్కి తగ్గింది. తెలుగులో బిజీ అయ్యింది. ఇక్కడ మళ్లీ బిజీ అయ్యేసరికి బాలీవుడ్ లో ప్రయత్నాలు షురూ చేసింది. హౌస్ ఫుల్ 4 చేస్తోంది. 

ఆ సినిమా షూటింగ్ లో పూజా నటన చూసి సాజిద్ బాగా ఇంప్రెస్ అయ్యారట.  దాంతో సాజిద్ నడియవాలా త్వరలో  తను చేయబోయే రెండు చిత్రాల్లోనూ ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసారు. రెండూ క్రేజీ ప్రాజెక్టలే అని తెలుస్తోంది. ఈ రెండు చిత్రాల్లో ఓ చిత్రం బాలీవుడ్ ఖాన్ త్రయం  అమీర్, షారుఖ్, సల్మాన్ లలో ఒకరితో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కనుక హిట్టైతే ఇక మళ్లీ తెలుగులో చేసే అవసరం ఆమెకు ఉండదు.