ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పూజా హెగ్డే తర్వాత బాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నాలు డీజే సినిమాతో తన రేంజ్ మారిపోయిందంటున్న పూజా హెగ్డే
తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోయిన్ల కొరత ఏ రేంజ్ లో ఉందో పూజా హెడ్డే ప్రూవ్ చేస్తోంది. డీజే సినిమాకు ముందు చేసిన సినిమాలు గుర్తింపునిచ్చినా పెద్దగా కాసులు మాత్రం పండించలేదు పూజకి, అయితే.. ఈ సారి డీజే తర్వాత మాత్రం తను ఒక రేంజ్ లో పబ్లిసిటీ దక్కడంతో బాలీవుడ్ రేంజ్ లోనే ఇక్కడా నిర్మాతలను రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. అమ్మడి అందాలకు ఫిదా అవుతున్న నిర్మాతలు అడిగినంతా సమర్పించుకుని హెడ్డేతో కానించేస్తున్నారు తమ సినిమాలు.
ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు చేసినా, ఆ పై బాలీవుడ్ కు వెళ్లి వచ్చినా పూజా హెగ్డే లక్ మారలేదు. అయితే డిజె సినిమాలో అమ్మడు తనలోని కమర్షియల్ అందాలు బయట పెట్టేసరికి ఆఫర్లు తరుముకుంటూ వస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ సినిమా కోసం కోటికి పైగా ఆఫర్ చేస్తూ పూజాతో బేరాలు సాగించి ఇప్పుడు అదే ఫైనల్ చేశారు. ఏకంగా కోటి అరవై లక్షలకు సెటిల్ అయిందట. వాస్తవానికి పూజా హెగ్డే కు డిజె సినిమాకు గాను ముట్టింది జస్ట్ 70 లక్షలు మాత్రమే. అలాంటిది ఒకసారిగా డబుల్ కన్నా ఎక్కువకు పెరిగిపోయింది.
ప్రస్తుతం టాలీవుడ్ లోని యంగ్ హీరోయిన్లు కోటికి పైగా తీసుకుంటున్నవారు ఒకరిద్దరు మాత్రమే వున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కోటికి పైగా తీసుకుంటోంది. ఇప్పుడు పూజా కూడా ఆ జాబితాలో చేరింది. మిగిలిన వారంతా నలభై లక్షల నుంచి అరవై లక్షల రేంజ్ లోనే వున్నారు ఇంకా.
