2 కోట్ల రూపాయల విలువైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడని చెపుతున్నారు. ఇందులో ఎంత నిజము ఎంత ఉంది అనేది ప్రక్కన పెడితే ఓ వర్గం పని గట్టుకుని మరీ ప్రచారం చేస్తోంది.
అల్లు అర్జున్ తో చేసిన డీజే తో పూజా హగ్దే జతకమే మారిపోయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా వరుస ప్లాప్స్. వాటితో ఐరెన్ లెగ్ అనిపించుకున్న పూజా..డీజే తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు వస్తున్న సంగతి తెలిసిందే. అతి తక్కువ టైంలోనే పూజ అన్ని భాషల్లో బిజీ హీరోయిన్ అయ్యింది. కొంతమంది డైరెక్టర్స్ కు లక్కీ హీరోయిన్ గా మారి అంతటా హాట్ టాపిక్ గా మారింది. అలా ఆమెను కంటిన్యూ చేస్తున్న డైరెక్టర్స్ లలో త్రివిక్రమ్ ఒకరు. త్రివిక్రమ్ తెరకెక్కించిన అలా వైకుంఠపురం లో , అరవింద సమేత చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటించింది. అంతే కాదు ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న మూవీ లోను ఈమె హీరోయిన్.
త్వరలో సెట్స్ పైకి రానున్న త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబో మూవీ లో కూడా ఈమెనే హీరోయిన్ ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటె..తాజాగా పూజా కు త్రివిక్రమ్ భారీ గిఫ్ట్ ఇచ్చాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతుంది. 2 కోట్ల రూపాయల విలువైన కారును గిఫ్ట్ గా ఇచ్చాడని చెపుతున్నారు. ఇందులో ఎంత నిజము ఎంత ఉంది అనేది ప్రక్కన పెడితే ఓ వర్గం పని గట్టుకుని మరీ ప్రచారం చేస్తోంది. త్రివిక్రమ్ అంటే పడని కొందరు ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.
అయితే అసలు నిజం వేరే ఉందని కొందరు అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసే సినిమాలకు సంబంధించి హారికా అండ్ హాసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations) లేదా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) పార్ట్నర్ షిప్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ రెండు బ్యానర్లలో త్రివిక్రమ్ పెట్టుబడులు ఉన్నాయంటారు. ఈ నేపథ్యంలో.. ప్రొడక్షన్ తరపున రూ. 2 కోట్లు పెట్టి ఒక లగ్జరీ కారుని కొనుగోలు చేశారని తెలుస్తోంది.
ఈ ప్రొడక్షన్స్‌లో చేసే సినిమాలకు సంబంధించి హీరోయిన్లను సెట్స్‌కి తీసుకురావడానికి, మళ్లీ తీసుకెళ్లి హోటల్స్‌లో దింపడానికి.. అద్దె కార్లు అయితే భారీగా ఖర్చు అవుతుందని.. ఏకంగా ఒక కారునే కొనేశారనేది చెప్తన్నారు.. దీనిని కొందరు.. మార్చి ..పూజా హెగ్డేకు త్రివిక్రమ్ రెండు కోట్ల విలువ చేసే కారుని గిఫ్ట్‌గా ఇచ్చాడనేలా పుట్టించేశారని టాక్. అయితే ఇది పూజా హెగ్డే కోసం కొన్న కారు అయితే కాదని.. ఈ బ్యానర్స్‌లో ఇక ఏ హీరోయిన్ చేసినా.. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు.. వారి కోసం ఈ కారు ఉంటుందనేది ప్రస్తుతానికి నడుస్తున్న కొందరు వివరణ ఇస్తున్నారు.
ఇక మహేష్ – త్రివిక్రమ్ మూవీ విషయానికి వస్తే ..అతడు ,ఖలేజా మూవీస్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండడం తో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా, నాగ వంశీ నిర్మిస్తున్నారు.
