ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజాహెగ్డేకి సిగ్గు చాలా ఎక్కువట. కానీ ఈరోజు సినిమాలలో బికినీ వేసుకునే రేంజ్ కి వెళ్లింది. ఈ ప్రాసెస్ లో తను చాలా కష్టపడినట్లు చెప్పుకొచ్చింది. తన మొదటి సంపాదన స్కూల్ డేస్ లో వచ్చినట్లు వెల్లడించింది.

''నాకు కాలిగ్రఫీలో ప్రవేశం ఉండడంతో ఏదైనా చాలా అందంగా రాసేదాన్ని. దీంతో మా తాతాగారు కోరడంతో ముంబై అథ్లెటిక్ అసోసియేషన్ లో పాల్గొన్న విద్యార్ధుల పేర్లను అందంగా రాశాను. అప్పుడు నాకు 200 రూపాయలిచ్చారు. అదే నా తొలి సంపాదన. ఆరోజు జాక్ పాట్ కొట్టినట్లు ఫీల్ అయ్యాను''అంటూ తన తొలి సంపాదన గురించి తెలిపింది.

ఇక తన సిగ్గు పోగొట్టుకోవడానికి పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొనాలని నిర్ణయించుకొని ప్రతి ఈవెంట్ లో పాల్గొనేదట. వచ్చిన ప్రతి అవకాశాన్ని చాలెంజింగ్ గా తీసుకోవడం వలనే సక్సెస్ అయ్యానని అంటోంది ఈ బ్యూటీ. మిస్ యూనివర్స్ పోటీల్లో సెకండ్ రన్నరప్ గా నిలవడంతో ఆమెకి వరుస యాడ్ అవకాశాలు వచ్చాయట. 

ఈ విషయాలను చెబుతూ.. 'యాడ్స్ లో నటించేప్పుడు ముందుగా 3 వేలు సంపాదించాను. ఆ తరువాత 5 వేలు, ఆ తరువాత 10 వేలకు చేరింది. సౌత్ సినిమాలలో ట్రై చేశాను. రణబీర్ కపూర్ తో చేసిన యాడ్ నా కెరీర్ ని మార్చేసింది. దాని కారణంగానే హ్రితిక్ సరసన మొహంజదారో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదంటూ'' చెప్పుకొచ్చింది.