అఖిల్, పూజా కలిసి నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`లో హరీష్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల్‌ని అభినందించిన ఆయన పూజా గురించి ప్రత్యేక్షంగా ప్రస్తావించారు. కరోనా సమయంలో అందరు ఖాళీగా ఉంటే, పూజా మాత్రం చాలా బిజీగా గడిపారని, బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారని తెలిపారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై దర్శకుడు హరీష్ శంకర్ ప్రశంసలు కురిపించాడు. అఖిల్, పూజా కలిసి నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`లో హరీష్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల్‌ని అభినందించిన ఆయన పూజా గురించి ప్రత్యేక్షంగా ప్రస్తావించారు. కరోనా సమయంలో అందరు ఖాళీగా ఉంటే, పూజా మాత్రం చాలా బిజీగా గడిపారని, బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారని తెలిపారు.
ఆమె సినిమాల లైనప్ అద్భుతంగా ఉందన్నారు. అఖిల్, బన్నీ, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ అంటూ టకా టకా చెప్పుకుంటూ వెళ్లాడు హరీష్ శంకర్. దీంతో తెలియకుండానే నోరు జారాడు. తన నెక్ట్స్ సినిమాలో ఆమెనే హీరోయిన్ అనే విషయంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` వేదికగా ఓ రకంగా అఫీషియల్‌గా ప్రకటించినట్టయ్యింది. దీంతో ఇప్పుడు పూజాని, హరీష్ శంకర్ చెప్పిన ఆ డైలాగ్‌ని కట్ చేసి పవన్ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.
హరీష్ శంకర్ నెక్ట్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి `భవదీయుడు భగత్‌సింగ్` అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని కూడా విడుదల చేశారు. బైక్‌పై తుపాకీతో ఉన్న పవన్ లుక్ అదిరిపోయేలా ఉంది. ఈ సారి జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, అంతకు మించి ఉంటుందని హరీష్ శంకర్ సినిమా ప్రారంభం నుంచి చెబుతున్నారు. చిత్ర పోస్టర్‌లోనే అదే విషయాన్ని స్పష్టం చేశారు.
అయితే ఇందులో పవన్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డేని ఎంపిక చేశారని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే అవి ఇప్పటి వరకు జస్ట్ రూమర్లుగానే ఉన్నాయి. కానీ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చాడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్‌తో చేస్తుందని చెప్పడంతో ఆ విషయం క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పటికే పూజా .. హరీష్ శంకర్ రూపొందించిన `డీజే`, `గద్దల కొండ గణేష్` చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన చెప్పింది నిజమే అయితే ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ సెట్ కాబోతుందని చెప్పొచ్చు.
also read: విడాకుల తర్వాత ఫస్ట్ టైమ్ బయటకొచ్చిన చైతూ.. అఖిల్ ఇంకా `సిసింద్రి`లో పాకుతున్నట్టే ఉందట..
ఇక పవన్ కళ్యాణ్‌తో పూజాకిది ఫస్ట్ టైమ్ కాబోతుంది. అలాగే పవన్‌తో హరీష్ శంకర్ గతంలో `గబ్బర్‌సింగ్` వంటి బ్లాక్ బస్టర్‌ని రూపొందించారు. ఆ తర్వాత చాలా గ్యాప్‌తో వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమిది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తున్నారు. అంతేకాదు పూజా నెక్ట్స్ బన్నీతో `ఐకాన్` చిత్రంలోనూ హీరోయిన్‌గా చేయబోతుందని క్లారిటీ ఇచ్చాడు హరీష్ శంకర్.
