స్టార్ లేడీ పూజా హెగ్డే (Pooja Hegde)బీచ్ లో డిన్నర్ నైట్ ఎంజాయ్ చేశారు. ఆమె తన స్పెషల్ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొన్న పూజా హెగ్డే... తన లేటెస్ట్ వెకేషన్ ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకున్నారు. 

వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే.. మహేష్(Mahesh Babu) తో మరో మారు జతకడుతుంది. దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ 28వ చిత్రాన్ని తెరకెక్కి స్తుండగా.. ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఏప్రిల్ నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ప్రభాస్ కి జంటగా పూజా చేసిన పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ సమ్మర్ కానుకగా మార్చ్ 11న విడుదల అవుతుంది. పూజా హెగ్డే నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్. రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. 

అలాగే ఆచార్య(Acharya), బీస్ట్ చిత్రాలు విధులకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు సైతం విడుదల తేదీలు ప్రకటించాయి. ఇక బాలీవుడ్ లో మరో రెండు చిత్రాలు చేస్తున్నారు పూజా. కెరీర్ ఇంత జోరుగా సాగుతుండగా కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ఇటీవలే ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది పూజా. సదరు విలాసవంతమైన ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నారు. సక్సెస్ పూజా వెన్నంటే ఉంటుండగా అమ్మడు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. 

ఖాళీ దొరికితే చాలు కుటుంబంతో విహారాలకు చెక్కేస్తున్న పూజా.. తల్లి బర్త్ డే సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. పూజా తల్లి గారైన లత హెగ్డే 60వ బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం పూజా హెగ్డే కుటుంబ సభ్యులతో పాటు మాల్దీవ్స్ వెళ్లారు. సాగర తీరంలో సాయంత్రం సమయాన కాండిల్ లైట్ డిన్నర్ లో పూజ అమ్మ, నాన్న, తమ్మడుతో పాటు పాల్గొన్నారు. ఈ మెమరబుల్ అకేషన్ కి సంబంధించిన ఫోటోలు పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. విషయం తెలుసుకున్న పూజా హెగ్డే ఫ్యాన్స్ లత హెగ్డే కు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ప్రియమైన తల్లి కోసం పూజా గ్రాండ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. 

View post on Instagram

కాగా ఒక దశలో పూజా హెగ్డే ఫేడ్ అవుట్ కానుందని అందరూ భావించారు. అరవింద సమేత వీరరాఘవ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ పూజా కెరీర్ నిలబెట్టాడని చెప్పవచ్చు. ప్లాప్స్ లో ఉన్న పూజా హెగ్డేను ఆయన కోరి తీసుకొని హిట్ ఇచ్చాడు. అల వైకుంఠపురంలో చిత్రానికి కూడా ఆమెను తీసుకొని ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. వరుసగా త్రివిక్రమ్ తన మూడో చిత్రానికి పూజాను ఎంపిక చేయడం విశేషం. పూజా హెగ్డే రీసెంట్ చిత్రాలన్నీ విజయం సాధించాయి. వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న అక్కినేని అఖిల్ కి పూజా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో హిట్ ఇచ్చింది.