Asianet News TeluguAsianet News Telugu

కొత్త ట్రెండ్‌కి నాంది అవుతున్న పూజా హెగ్డే.. `వరుడు కావలెను` ఈవెంట్‌లో మెరుపులు

 హీరోయిన్లు గెస్ట్ గా రావడమనే కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తుంది పూజా. ఇదే విషయాన్ని శనివారం రాత్రి జరిగిన `వరుడు కావలెను` సంగీత్‌ ఈవెంట్‌లో పూజాతోపాటు రీతూ వర్మ వంటి వారు వెల్లడించడం విశేషం.

pooja hegde creat new trend heroines as guest in movie events
Author
Hyderabad, First Published Oct 24, 2021, 11:10 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పూజా హెగ్డే(Pooja Hegde) టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. హీరోయిన్లలో టాప్‌ పొజిషియన్‌ని అనుభవిస్తుంది. దాదాపు టాప్‌ స్టార్‌ హీరోలందరితోనూ జోడి కట్టిన ఈ భామ ఇప్పుడు కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుడుతుంది.  హీరోయిన్లు గెస్ట్ గా రావడమనే కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తుంది Pooja Hegde. ఇదే విషయాన్ని శనివారం రాత్రి జరిగిన `వరుడు కావలెను` (Varudu Kavalenu) సంగీత్‌ ఈవెంట్‌లో పూజాతోపాటు రీతూ వర్మ వంటి వారు వెల్లడించడం విశేషం. నాగశౌర్య, రితూ వర్మ జంటగా నటించిన Varudu Kavalenu చిత్రానికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కాబోతుంది. 

అందులో భాగంగా ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. శనివారం చిత్ర సంగీత్‌ కార్యక్రమాన్ని నిర్వహించగా, పూజా హెగ్డే గెస్ట్ గా వచ్చారు. ఇందులో పూజా మాట్లాడుతూ, హీరోయిన్‌ని అతిథిగా ఆహ్వానించడం చాలా అరుదుగా జరగుతుందని చెప్పింది. తనని గెస్ట్ గా ఆహ్వానించినందుకు హ్యాపీగా ఉందని, ఆ క్రెడిట్‌ మాత్రం నిర్మాతలు ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు), వంశీలకు దక్కుతుందని చెప్పింది. వీరి బ్యానర్‌ తనకు హోమ్‌ బ్యానర్‌ లాంటిదని చెప్పింది పూజా. 

ఆమె ఇంకా చెబుతూ, కరోనా వల్ల ఎంతో బాధపడ్డాం. కాస్త రిలాక్స్‌ అవ్వడం కోసం థియేటర్‌లోనే సినిమా చూడండని చెప్పింది. `దర్శకత్వ శాఖలో మహిళలు చాలా తక్కువ ఉంటారు. `వరుడు కావలెను` మహిళా దర్శకురాలు తెరకెక్కించిన మంచి ప్రేమకథ. అందరూ సినిమా చూసి మీ బాధల్ని మరచిపోండి. దర్శకురాలిగా సౌజన్యకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. మహిళలు మాత్రమే మహిళల కథలను మరింత బాగా చెప్పగలర`ని తెలిపింది పూజా.

ఈ ఈవెంట్‌లో Naga Shaurya మాట్లాడుతూ, `మన కుటుంబం మంచిది` అని ఎంత గర్వంగా చెప్పుకుంటామో.. మా సినిమా బాగా వచ్చిందని అంతే గర్వంగా చెప్పుకొంటాం. ఇది ఓవర్‌ కాన్షిడెన్స్‌ కాదు. సినిమా పట్ల ఉన్న నమ్మకం. సినిమాకు బాగా వచ్చిందని తెలిసి ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. అయినా నిర్మాతలు థియేటర్‌ రిలీజ్‌ కోసమే వేచి చూశారు. సౌజన్య అక్క ఎన్నో సంవత్సరాలుగా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తూ ఓ మంచికథ రాసుకుంది. ఈ సినిమాతో దర్శకురాలిగా అవకాశం అందుకుంది. మంచి అవుట్‌పుట్‌ కోసం చాలా పోరాడింది. ఈ సినిమా హిట్‌తో తన కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా దక్కుతుందన్నాడు శౌర్య. పూజా గెస్ట్ గా రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. 

హీరోయిన్‌ రీతూవర్మ చెబుతూ, `ప్రేమ, అనుబంథం ఇతివృత్తంగా పూర్తిగా కుటుంబ కథాంశంతో రూపొందిన చిత్రమిదని, హీరోయిన్‌ని గెస్ట్ గా పిలవడం రేర్‌గా జరుగుతుంది. ఈ ఈవెంట్‌కి పూజా రావడం ఆనందంగా ఉందని చెప్పింది. పూజా గెస్ట్ గా రావడంపై అంతా ప్రత్యేకంగా మాట్లాడుకోవడం, ఇకపై హీరోయిన్ల గెస్ట్ గా రావడమనే ట్రెండ్‌కి నాంది అవుతుందంటున్నాయి సినీ వర్గాలు. అయితే పూజా మాత్రం తనదైన గ్లామర్‌ లుక్‌లో అందరిని కట్టిపడేసింది. 

related news: క్లీవేజ్‌ అందాలతో రీతూ వర్మ సంచలనం.. బ్లౌజ్‌ వేసుకోవడం మర్చిపోయావా అంటూ నెటిజన్ల కామెంట్‌.. పూజా హెగ్డేకే షాక్

Follow Us:
Download App:
  • android
  • ios