టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి పూజాహెగ్డే. వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఇటీవల ఆమె నటించిన 'మహర్షి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.

ప్రస్తుతం ఆమె బాలీవుడ్ తో పాటు తెలుగులో ప్రభాస్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది.

తాజాగా మరో కొత్త ఫోటో పెట్టింది. పూల బికినీ వేసుకొని స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తూ కనిపించింది. స్టైలిష్ గ్లాసెస్ ని ధరించి ఎంతో అందంగా కనిపిస్తోంది. ఈ ఫోటోకి 'తుఫాను ముందు ప్రశాంతత. ఈ ఏడాదిలో నేను చేయాల్సిన సినిమాల వర్క్ ను ప్రారంభించే ముందు ఆశ్వాదిస్తున్న చివరి మునక' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో పెట్టిన కొన్ని గంటల్లోనే నాలుగు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.