Asianet News TeluguAsianet News Telugu

అదరకొట్టే అందం: సైకిల్ తొక్కుతూ పూజ హెగ్డే

వాల్మీకి' తమిళ్‌లో హిట్ అయిన 'జిగర్తాండా' అనే సినిమాకు రిమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో  అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌‌పై వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది.

Pooja Hegde as Sridevi in Valmiki
Author
Hyderabad, First Published Aug 26, 2019, 2:29 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే మరోసారి మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌‌తో 'వాల్మీకి' సినిమా చేస్తోంది. ఈ సినిమాను హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను చిత్రం టీమ్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఊపులో పూజా హెగ్డే లుక్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో శ్రీదేవి‌గా పూజా కనిపించనుంది. సైకిల్‌పై వెళ్తూ.. వింటేజ్ లుక్‌లో అదిరిపోయింది పూజా హెగ్డే . 

'వాల్మీకి' తమిళ్‌లో హిట్ అయిన 'జిగర్తాండా' అనే సినిమాకు రిమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో  అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు చేస్తున్నారు. 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌‌పై వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది.

ఇక తమిళ దర్శకుడు మిస్కిన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ముఖముడి చిత్రంతో తమిళ పరిశ్రమతో సినీ కెరీర్ కు ఎంట్రీ ఇచ్చింది పూజ. ఆ చిత్రం నిరాశపరచడంతో పూజాహెగ్డేను తమిళసినిమా  వదిలేసింది.  ఆ తరువాత టాలీవుడ్‌ చేసిన సినిమాలతో ఆమె ఇక్కడ  స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

అల్లుఅర్జున్, మహేశ్‌బాబు వంటి స్టార్లతో జతకట్టి వరస హిట్స్‌ను తన ఖాతా లో వేసుకుంది. రంగస్థలం చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌లో ఆడి దుమ్మురేపింది .  ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి.  హిందీలో హౌస్‌పుల్‌ 4లో నటిస్తోంది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios