ఈ మధ్యకాలంలో తారలను సోషల్ మీడియా ద్వారా నేరుగా ప్రశ్నిస్తున్నారు అభిమానులు. నిన్న జరిగిన 'అరవింద సమేత' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ పూజా హెగ్డే కనిపించలేదు.
ఈ మధ్యకాలంలో తారలను సోషల్ మీడియా ద్వారా నేరుగా ప్రశ్నిస్తున్నారు అభిమానులు. నిన్న జరిగిన 'అరవింద సమేత' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ పూజా హెగ్డే కనిపించలేదు. దీంతో అభిమానులు ఆమెను ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన పూజా హెగ్డే.. ''కమిట్ అయిన సినిమాల కారణంగా షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చింది. జైసల్మేర్ లో షూటింగ్ జరుగుతోంది. అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరు కాలేకపోయాను. ఈవెంట్ కి రాలేకపోయినప్పటికీ లైఫ్ లో ఫాలో అవుతూనే ఉన్నాను.
ఎన్టీఆర్ స్పీచ్ లో ప్రతి మాట తన గుండెల్లో నుండి వచ్చింది. ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు నాకు అర్ధం కాకపోవచ్చు కానీ ఆ ఫీలింగ్ ని నేను కూడా అనుభవించాను'' అంటూ చెప్పుకొచ్చింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ మిస్ అవ్వడమనేది పెద్దగా జరగదు. పైగా 'అరవింద సమేత' లాంటి భారీ బడ్జెట్ సినిమా.. అందుకే ఈవెంట్ కి డుమ్మా కొట్టిన విషయంలో ఆమెకి నెగెటివిటీ రాకుడదని ముందుగానే క్లారిటీ ఇచ్చేసింది పూజా హెగ్డే.
సంబంధిత వార్తలు..
'అరవింద సమేత'లో నో ఫన్.. ఓన్లీ యాక్షన్!
'అరవింద సమేత' ట్రైలర్.. యూట్యూబ్ లో రికార్డుల మోత!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై 'అరవింద సమేత' హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
మా నాన్నకిచ్చిన మాట మీకిస్తున్నా.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!
జీవితంలో కూడా నిజమైన హీరో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కామెంట్స్!
కళ్యాణ్ రామ్ స్పీచ్ తో ఏడ్చేసిన ఎన్టీఆర్!
ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం.. 'అరవింద సమేత' ట్రైలర్ టాక్!
