ఒకే ఒక్క సినిమాతో యనలేని క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ పూజా. డిజే లో తన అందాల ప్రదర్శనకు ఇప్పుడు ఆఫర్లు వెళ్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన ఏకకాలంలో సినిమాలు చేసే ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు. వీటికి తోడు రాంచరణ్ మూవీలో జిగేలురాణిగా ఐటెం సాంగ్ లో కూడా మెరవబోతోంది పూజా హెగ్డే. మరి ఇంతగా ఈమెకు ఛాన్సులు రావడానికి అదృష్టం ఒక్కటే కారణం కాదు.. ఆమె ట్యాలెంట్ కూడా.

తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో చూస్తే షాక్ తినాల్సిందే. సిల్క్ క్లాత్ నే తాడుగా మార్చుకుని.. అటూ ఇటూ మెలికలు తిరుగుతున్న తీరు చూసి ఎవరైనా ఫిదా అవాల్సిందే. నేల మీద నుంచుని ప్రతీ ఒక్కరూ డ్యాన్స్ చేస్తారు. కానీ గాల్లో ఉండి తాడుపై వేళ్లాడుతూ కూడా అదే స్థాయిలో నృత్యం ఆడగల ప్రతిభ పూజా హెగ్డే సొంతం.