ఇటీవల ఓ జాతీయ మీడియాకు నటి పూజా బేడి ఇచ్చిన ఇంటర్వ్యూ చర్చనీయాంశం అయ్యింది. తనకు కాబోయే భర్తతో తన పిల్లలు అలయ ఫర్నిచర్‌వాలా, ఓమర్‌ల అనుబంధం గురించి చెప్పింది పూజా బేడీ. అలయ, ఒమర్‌లు పూజా మొదటి భర్త ఫర్హాన్‌ ఫర్నీచర్‌వాలా సంతానం. 1994లో ఫర్హాన్‌ను పెళ్లాడిన పూజ 2004లో అతని నుంచి విడాకులు తీసుకుంది. 

అయితే ఇప్పుడు తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా వివరించింది పూజా బేడీ.. `నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవటం కన్నా.. నా పిల్లలు నేను జీవితంలో సెటిల్ అవ్వాలని భావించారు. వాళ్లు ఓ అద్బుతమైన వ్యక్తి నా జీవితంలోకి రావాలని కోరుకున్నారు. వాళ్లు నా అవసరాల గురించి ఆలోచిస్తున్నారు. అయితే నేను ఏది బలవంతంగా చేయాలని వాళ్లు అనుకోలేదు. మనేక్‌ను పెళ్లిచేసుకోవాలని వాళ్లే సూచించారు` అని తెలిపింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Unfiltered togetherness... ❤

A post shared by POOJA BEDI (@poojabediofficial) on Nov 11, 2019 at 8:51pm PST

అంతేకాదు తన మాజీ భర్త పెళ్లి గురించి కూడా పిల్లలతో తనతో చెప్పారని పూజ చెప్పింది. `అమ్మా, నాన్నను చూడు లైలా ఆంటీని పెళ్లి చేసుకొని కొడుకును కన్నాడు, జీవితంలో సెటిల్‌ అయ్యాడు` అని వాళ్లే చెప్పారట. జీవితంలో ఎదురైన అనుభవాలు మిమ్మల్ని మరింత మంచిగా మార్చాలి గాని, చెడ్డగా కాదు జీవితంలో ఒక పెళ్లి ఫెయిల్‌ అయ్యిందటే రెండోది కూడ అవుతుందని కాదు అని అభిప్రాయపడింది పూజ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Unfiltered togetherness... ❤

A post shared by POOJA BEDI (@poojabediofficial) on Nov 11, 2019 at 8:51pm PST