Asianet News TeluguAsianet News Telugu

యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘పొన్నియిన్ సెల్వన్’ హవా.. సాలిడ్ కలెక్షన్స్.!

కోలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’.  మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ మూవీ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా యూఎస్ ఏ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.  
 

Ponniyin Selvan Solid Collections at the US Box Office!
Author
First Published Oct 8, 2022, 4:30 PM IST

తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’(Ponniyin Selvan 1). స్టార్  హీరోలు, హీరోయిన్లతో భారీ విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా పర్లేదు అనిపిస్తోంది. తొలిరోజు మిక్డ్స్ టాక్ ను అందుకున్న భారీ ఫిల్మ్ ఆ తర్వాత పాజిటివ్ టాక్ తో పుంజుకుంది. బాక్సాఫీస్ వద్ద తమిళ చిత్రం సత్తా చూపిస్తోంది. క్రమక్రమంగా కలెక్షన్లను పెంచుకుంటూ రికార్డులను బ్రేక్ చేస్తోంది. తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ రూ.300 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన ఐదో తమిళ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

మరోవైపు యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద కూడా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ కాసుల వర్షం కురిపిస్తోంది. తక్కువ సమయంలో కలెక్షన్ల పరంగా అక్కడ మైల్ స్టోన్ ను రీచ్ కావడం విశేషం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. కేవలం వారం రోజుల్లోనే ‘పొన్నియిన్ సెల్వన్’ యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద 5 మిలియన్ల డాలర్స్ ను రాబట్టింది.  తమిళం చిత్రాల్లో ఈ కలెక్షన్స్ తో టాప్ లో నిలిచింది. రెండు మూడు రోజులు స్టడీ వసూళ్లు రాబట్టి ఒక్కసారిగా పుంజుకుంది. ఈస్థాయిలో కలెక్షన్లు రాబట్టం ఓవర్సీస్ మార్కెట్ లో భారీ మొత్తమనే చెప్పాలి. దీంతో సినిమా ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది. 

ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరపైకి వచ్చిన చిత్రమే ‘పొన్నియిన్ సెల్వన్’. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కించారు. కోలీవుడ్ కు చెందిన భారీ స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్,  కార్తీ, జయం రవి హీరోలుగా ప్రధాన పాత్రలో నటించారు. ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష క్రిష్ణన్, శోభితా దూళిపాళ హీరోయిన్లు గా అలరించారు. లైకా  ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో నిర్మించారు. సంగీత దర్శుకుడు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. సెప్టెంబర్ 30న పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. త్వరలో ఈ చిత్రం రెండో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios