Asianet News TeluguAsianet News Telugu

మూడు రోజుల్లో రూ. 200 కోట్లు... దుమ్మురేపుతున్న పొన్నియిన్ సెల్వన్!

వరల్డ్ వైడ్ పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్స్ దుమ్ముదులుపుతుంది. మణిరత్నం విజువల్ వండర్ వీకెండ్ గ్రాండ్ గా ముగించింది.

ponniyin selvan collections in three day collects 200 crores world wide
Author
First Published Oct 3, 2022, 4:24 PM IST


మూడు రోజుల్లో రూ. 200 కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్లు సాధించినట్లు అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. ఈ క్రమంలో పొన్నియిన్ సెల్వన్ కోలీవుడ్ రికార్డ్స్ పూర్తిగా బ్రేక్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 30న పొన్నియిన్ సెల్వన్ పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదలైంది. పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కథ, విజువల్స్, మ్యూజిక్, నటుల పెరఫార్మన్స్ ఆకట్టుకున్నాయి. అయితే ఉత్కంఠ రేపే యుద్ధ సన్నివేశాలు, స్క్రీన్ ప్లే నిరాశపరిచాయి. 

అలాగే లెక్కకు మించిన పాత్రలు, నేటివిటీ ఇతర భాషల ప్రేక్షకులను ఇబ్బంది పెట్టిందన్న వాదన వినిపించింది. కేవలం చిత్రానికి పాస్ మార్కులు పడ్డాయి. అయితే తమిళ ప్రేక్షకులు పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు. ఓవర్సీస్ లో తమిళ వర్షన్ భారీ వసూళ్లు అందుకుంటుంది. తెలుగులో కూడా పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని ఆదరణ బాగానే ఉంది. దసరా సెలవులు కలిసొస్తున్నాయి. 

మూడు రోజుల్లో పొన్నియిన్ సెల్వన్ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 13 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు సమాచారం ఇస్తున్నాయి. ఇక రెండు వందల కోట్ల వసూళ్లతో వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి వీకెండ్ గ్రాండ్ గా ముగించింది. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని తన డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కించారు. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా పొన్నియిన్ సెల్వన్ తెరక్కింది. రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 

కార్తీ, విక్రమ్, జయం రవి, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలు చేశారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.  పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ సమకూర్చారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios