ప్రభాస్ చేస్తున్న ఆదిపురష్ లో కమిటైన నాటినుంచీ తెలుగులోనూ సైప్ కు గుర్తింపు పెరిగింది. ఆయన గురించి డిస్కషన్స్ , ఆయనపై వచ్చే వార్తలను పరిశీలించం మనవాళ్లూ చేస్తున్నారు. ఆదిపురుష్ గురించి ట్వీట్ చేసి  వివాదంలో ఇరుక్కుని, వివరణ ఇచ్చిన ఆయన ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కుని దేశం మొత్తం హాట్ టాపిక్ ముంబయి శివారులో ఉన్న సైఫ్‌ ఇంటివద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేయాల్సిన పరిస్దితి ఏర్పడింది. 

వివరాల్లోకి వెళితే.. సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘తాండవ్‌’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు హిమాన్షు కిషన్‌ మెహ్రా నిర్మాతగా వ్యవహరించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌ జనవరి 15న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల అయ్యింది. అయితే ఈ సీరిస్ లో అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయంటూ వివాదం మొదలైంది. దాంతో ఆ సీరిస్ ని ఆపేయాలని నిరసనలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో నూ బ్యాన్‌ తాండవ్‌, బాయ్‌కాట్‌తాండవ్‌ పేరుతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 

 ‘తాండవ్‌’పై నిరసనల సెగ కొనసాగుతూనే ఉంది. దేవుళ్లను అవమానిస్తూ.. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఆ వెబ్‌ సిరీస్‌ ఉందంటూ భాజపా ఎమ్మెల్యే రామ్‌కదమ్‌ ముంబయిలోని ఘట్కోపర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతకుముందు ప్రదర్శనను నిలిపివేయాలంటూ భాజపా ఎంపీ మనోజ్‌కుమార్‌ కొటక్‌ కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు లేఖ రాశారు. మరోవైపు వెబ్‌సిరీస్‌పై వ్యతిరేకత పెరగడంతో ముందస్తు జాగ్రత్తగా సైఫ్‌ ఇంటివద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేయాల్సిన పరిస్దితి ఏర్పడింది. 

‘తాండవ్‌’లో ఉద్దేశపూర్వంగా దేవుళ్లను ఎగతాళి చేశారని, సెక్స్‌, హింస, మాదకద్రవ్యాలు.. ఇలా అనేక రకాలుగా విద్వేషాలు రెచ్చగొట్టేలా వెబ్‌సిరీస్‌ ఉందని ఎంపీ మనోజ్‌ లేఖలో పేర్కొన్నారు.