Asianet News TeluguAsianet News Telugu

నగ్న ఫొటోషూట్‌ కేసులో విచారణకు రణ్ వీర్ సింగ్.. మౌన వ్రతం పాటించిన స్టార్ హీరో..?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నగ్న ఫోటో షూట్ వివాదంలో విచారణకు హజరు అయ్యారు. కాని ఆయన ఈ విచారణంలో డిఫరెంట్ గా స్పందించినట్టు తెలుస్తోంది..? అసలు రణ్ వీర్ సింగ్ విచారణలో ఏం మాట్లాడారు..? 

Police Records Ranveer Singh Statement in nude  Photoshoot case
Author
First Published Sep 1, 2022, 8:11 AM IST


బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌  ఓ మ్యాగజైన్‌ కోసం రీసెంట్ గా  న్యూడ్ గా ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. ఆన్యూడ్ ఫోటో షూట్‌ ఎంతటి దుమారం రేపిందో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దీనిపై ఉద్యమాలు చేయడానికే బయలుదేరారు సామాజిక, మహిళ సంఘాలు. అంతటితో ఊరుకోలేదు.. రణ్ వీర్ పై దేశ వ్యాప్తంగా కేసులు కూడా నమోదు చేశారు. 

అయితే దేశవ్యాప్తంగా నమోదు అయిన కేసుల్లో ఏమో కాని..  ఇక మహిళ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసు స్టేషన్‌లో రణ్‌వీర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి విచారణ కూడా షురూ అయ్యింది. ఈ కేసులో ముంబై పోలీసులు రణ్‌వీర్‌కు  సమన్లు జారీ చేసి ఈనెల 22న విచారణకు హాజరు కావాలని హుకూం జారీ చేశారు. అయితే ఆ విచారణకు హాజరు అయ్చారు బాలీవుడ్ స్టార్  రణ్‌వీర్‌.. కాని అక్కడ ఆయన పూర్తి భిన్నంగా స్పందించారని సమాచారం. 

రణ్ వీర్ సింగ్ పోలీస్ విచారణలో  అమాయకత్వాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది.  ముంబైలోని చెంబూరు పోలీసు స్టేషన్‌లో  ఈ విచారణ జరిగింది.  రణ్‌వీర్‌ను పోలీసులు 2 గంటలకుపైగా రకరకాల ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. తన న్యూడ్ ఫొటోషూట్‌పై ఇంత రచ్చ జరుగుతున్నా కాని.. రణవీర్ సింగ్ మాత్రం ఈ విషయంలో  ఇంత వరకు నోరు విప్పలేదట.  పోలీసుల ముందు కూడా ఇలాగే మౌన వ్రతం పాటించాడట రణ్ వీర్ సింగ్.  ఫొటోషూట్ పరిణామాలపై తనకు అవగాహన లేదంటూ బుకాయిచ్చాడట  స్టార్ హీరో. 

ఇక పోలీసులు ఏం అడిగిన ఇదే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదైనా పోలీసులకు నేరుగా చెప్పాలని, మీడియాకు ఎలాంటి ప్రకటన ఇవ్వొద్దంటూ రణవీర్ సింగ్‌ కు ఆయన తరపున వాదిస్తున్న  న్యాయవాదులు సూచించినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఈ మొత్తం విచారణ సమయంలో రణవీర్ మౌనంగా ఉన్నాడని, ఫొటోలను తాను అప్‌లోడ్‌ కానీ, పబ్లిష్‌ చేయలేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక  రణ్‌వీర్‌ సింగ్ పై ఐపీసీ సెక్షన్ 292, 294, 509, 67(ఏ) కింద కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఏమిచెప్పకపోవడంతో.. అవసరమైతే మరోసారి సమన్లు ఇచ్చి విచారణకు  పిలిపిస్తామంటున్నారు అధికారులు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios