శనివారం సాయంత్రం సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్‌ బాబు ఇంటి దగ్గర నలుగురు ఆగంతకులు కలకలం సృష్టించారు. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు మోహన్ బాబు ఫాం హౌజ్‌ వాచ్‌ మెన్‌ బెదిరించారు. ఈ సంఘటనపై మోహన్‌ బాబు కుటుంబం కంప్లయింట్ ఇవ్వటంతో విచారణ చేపట్టిన పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారు మైలార్‌ దేవరపల్లి దుర్గా నగర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు.

శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఇంట్లోనుంచి ఓ బైక్‌ బయటకు వెళ్లేందుకు వాచ్‌ మేన్‌ ఫాంహౌజ్‌ పెద్ద గేటు తెరిచాడు. అదే సమయంలో ఓ కారు వేగంగా దూసుకువచ్చి ఇంట్లోకి ప్రవేశించింది. వాచ్‌ మెన్‌ ఆపేందుకు ప్రయత్నించటంతో అతపిపై బెదిరింపులకు దిగారు. దీంతో వెంటనే అక్కడు చేరుకున్న మోహన్‌ బాబు ఆయన పెద్ద కుమార్ విష్ణు, పోలీస్‌ కంప్లయింట్ ఇచ్చారు.