మహేష్‌బాబు నటించిన `గుంటూరు కారం` సినిమాకి పెద్ద షాక్‌ తగిలింది. హైదరాబాద్‌ పోలీసులు చివరి నిమిషంలో హ్యాండిచ్చారు. డైలామాలో పెట్టారు.  

మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం `గుంటూరు కారం`. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి మరో నాయికగా కనిపించబోతుంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. సినిమాకి సంబంధించిన పాటలు, టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఇటీవల వచ్చిన `కుర్చీ మడత పెట్టి` అనే పాట దుమ్ములేపుతుంది. వివాదాలతోపాటు వైరల్‌ అయ్యింది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అయ్యింది. పాటపై ట్రోల్‌ సినిమాకి ప్రమోషన్‌ చేసి పెడుతుంది.

ఇక ప్రమోషన్‌ పరంగా సైలెంట్‌ గా ఉన్న టీమ్‌.. `గుంటూరు కారం` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ భారీగా ప్లాన్‌ చేసింది. అదే సమయంలో ఈవెంట్‌లోనే చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. దీంతో ఈవెంట్‌ కోసం మహేష్‌ ఫ్యాన్స్ అందరు వెయిట్‌ చేస్తున్నారు. రేపు జనవరి 6న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేసింది యూనిట్‌. అదే ఈవెంట్‌ లో ట్రైలర్‌ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. అయితే తాజాగా మేకర్స్‌ కి పెద్ద షాక్‌ ఇచ్చింది పోలీస్‌ డిపార్ట్ మెంట్‌. 

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని యూసఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో అనుకున్నారు. మొదట పర్మీషన్‌ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు సడెన్‌గా హ్యాండిచ్చారట. పర్మీషన్‌ రద్దు చేసినట్టు తెలుస్తుంది. లా అండ్‌ ఆర్డర్‌ సమస్య వస్తుందని భావించిన పోలీసులు పర్మీషన్‌ని రద్దు చేశారట. మహేష్‌కి భారీగా ఫ్యాన్స్ ఉంటారు. ఆ తాకిడి ఇబ్బంది అవుతుందని, కంట్రోల్‌ చేయడం కష్టమని, చాలా ట్రాఫిక్‌ సమస్య వస్తుందని పర్మీషన్‌ని రద్దు చేసినట్టు తెలుస్తుంది. దీంతో టీమ్‌ షాక్‌లోకి వెళ్లింది. ఇప్పుడు కొత్త వేదిక వెతికే పనిలో ఉన్నారు. రేపే ఈవెంట్‌ కావడంతో, ఇంకా వేదిక ఫైనల్‌ కావడంతో యూనిట్‌లోనూ కలవరం స్టార్ట్ అయ్యింది. మరి కొత్త వేదిక ఎక్కడ ప్లాన్‌ చేస్తారో చూడాలి.