Asianet News TeluguAsianet News Telugu

రాజ్ తరుణ్ ను అడ్డుకున్న పోలీసులు,కేసు ఫైల్

రీసెంట్ రాజ్ తరణ్ తో ఒరేయ్ బుజ్జిగా రూపొందించిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్ మరో సినిమా చేస్తున్నాడు. ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరుగుతోంది. ఉప్పల్ లోని బ్యాంక్ కాలనీలో సినిమాకు సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేశారు. అంతలోనే అక్కడికి పోలీసులు వచ్చారు. షూటింగ్ ను ఆపేశారు.
 

police case on Raj Tarun movie unit
Author
Hyderabad, First Published Oct 18, 2020, 1:53 PM IST

 షూటింగ్ లు చేసేటప్పుడు లొకేషన్స్ కు పోలీస్ ఫర్మిషన్ అత్యవసరం. ముఖ్యంగా ఈ కరోనా టైమ్ లో ఫర్మిషన్ తీసుకోకుండా పబ్లిక్ ప్లేస్ లలో అసలు అనుమతించటం లేదు. తాజాగా అలా ఫర్మిషన్ తీసుకోకుండా షూటింగ్ మొదలెట్టినందుకు..హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న కొత్త  సినిమా షూటింగ్ ను పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. ఈ కరోనా కాలంలో ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా షూటింగ్ చేస్తున్నారంటూ పోలీసులు సినిమా యూనిట్ పై కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే..రీసెంట్ రాజ్ తరణ్ తో ఒరేయ్ బుజ్జిగా రూపొందించిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్ మరో సినిమా చేస్తున్నాడు. ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరుగుతోంది. ఉప్పల్ లోని బ్యాంక్ కాలనీలో సినిమాకు సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేశారు. అంతలోనే అక్కడికి పోలీసులు వచ్చారు. షూటింగ్ ను ఆపేశారు.

 పోలీసుల నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే ఔట్ డోర్ లో ఈ షూటింగ్ పెట్టటమే అందుకు కారణం అని తేల్చారు. మరీ ముఖ్యంగా ఈ కరోనా టైమ్ లో పబ్లిక్ ప్లేసుల్లో షూటింగ్ అంటే పోలీసుల అనుమతులు తప్పనిసరి అని క్లియర్ గా చెప్పారు. అలాంటిదేం లేకుండానే యూనిట్ షూటింగ్  చేసిందట. అందుకే షూటింగ్ ఆపేసి, ప్రొడక్షన్ మేనేజర్ పై కేసు ఫైల్ చేశారు ఉప్పల్ పోలీసులు.  

ఇక రాజ్ త‌రుణ్ హీరోగా కొండా విజ‌య్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప్రొడ‌క్ష‌న్ నెం.1గా మ‌హిద‌ర్‌, దేవేష్ నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ హైద‌రాబాద్ కోకాపేట‌‌లో  ఈ మధ్యనే ప్రారంభ‌మై రెగ్యులర్ షెడ్యూల్ తో షూటింగ్ జరుపుకుంటోంది.

 ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా మాట్లాడుతూ.. ”గుండె జారి గ‌ల్లంత‌య్యిందే, ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా చిత్రాల‌కు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. రాజ్ త‌రుణ్‌తో ఫుల్ లెంగ్త్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా `ఒరేయ్ బుజ్జిగా..` మూవీ చేశాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఇప్పుడు ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటూనే ఒక డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ ఉంటుంది..” అన్నారు.

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ.. ”విజ‌య్ కుమార్ గారు చాలా టాలెండెడ్ డైరెక్ట‌ర్. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ‌‘ఒరేయ్ బుజ్జిగా’ మూవీని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. డెఫినెట్‌గా అది ఒక మంచి సినిమా అవుతుంది. వెంట‌నే ఆయ‌న‌తో మ‌రోసారి వ‌ర్క్ చేయ‌డం హ్యాపీగా ఉంది” అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios