Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం, జబర్దస్త్ కమెడియన్ పై కేసు నమోదు..బుద్దిగా కనిపించే అతడు ఇలా

జబర్దస్త్ లాంటి బుల్లితెర షోలతో చాలా మంది ట్యాలెంటెడ్ యువ ఆర్టిస్టులు వెలుగులోకి వస్తున్నారు. తమ ప్రతిభతో బుల్లితెరపై ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటున్నారు.

police case filed against Jabardasth Nava Sandeep dtr
Author
First Published Aug 20, 2023, 12:41 PM IST

జబర్దస్త్ లాంటి బుల్లితెర షోలతో చాలా మంది ట్యాలెంటెడ్ యువ ఆర్టిస్టులు వెలుగులోకి వస్తున్నారు. తమ ప్రతిభతో బుల్లితెరపై ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటున్నారు. జబర్దస్త్ షోతో పాపులర్ అయిన కమెడియన్ ఒకరు ప్రస్తుతం తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. 

ఆ కమెడియన్ ఎవరో కాదు జానపద గాత్రంతో సింగర్ గా పాపులర్ అయిన నవ సందీప్. నవ సందీప్ పై తాజాగా మధుర నగర్ లో కేసు నమోదైంది. తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నవ సందీప్ మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో నవసందీప్ పై పోలీసులు వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. 

పెళ్లి పేరుతో తనని నమ్మించి మోసపోయానని యువతి చెబుతోంది. అతడి మాటలు నమ్మానని, కానీ ఇప్పుడు మోసం చేశాక ముఖం చాటేస్తున్నాడు అని యువతి ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకోమని అడుగుతుంటే తప్పించుకుంటున్నట్లు ఆమె తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

నవ సందీప్ కమెడియన్ గా, సింగర్ గా జబర్దస్త్ షోలో పాల్గొంటున్నాడు. అలాగే అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో తన జానపద పాటలతో ప్రేక్షకులని అలరించాడు. ఎంతో ట్యాలెంట్ ఉన్న నవ సందీప్ బుద్దిగా కనిపిస్తూ ఇలా యువతిని మోసం చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూట్యూబ్ లో ఎమోషనల్ ప్రేమ గీతాలతో కూడా నవ సందీప్ పాపులర్ అయ్యాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios