Asianet News TeluguAsianet News Telugu

స్టోరీ ఐడియా అదిరింది...సినిమా ఎలా ఉంటుందో !?

కాన్సెప్టు ఓరియెంటెడ్ కథలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి.ముఖ్యంగా ట్రైవ్ ట్రావెల్ చేసుకునే వచ్చే కాన్సెప్టు సినిమాలు అయితే మరీ కదలకుండా కూర్చుని చూడాలనిపించేలా ఉంటాయి.అలాంటి సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. సినీ లవర్స్ మద్దతు ఉంటుంది.  అయితే అలాంటి సినిమాలు తీసే దర్శకులు అరుదు. అలాంటి స్టోరీ ఐడియాలు ప్రతీసారీ దొరకవు. అంతలా విభిన్నంగా ఆలోచించరు కూడా. టైమ్ ట్రావెల్ మీద మనకు ఇప్పటికే ఆదిత్య 369,24 (సూర్య) వంటి సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. మరోసారి అలాంటి థాట్ తో ఓ సినిమా రాబోతోంది. అయితే ఆ టైమ్ ట్రావెల్ సినిమాలకు భిన్నమైన ఐడియా ఇది. ఇది క్రాస్ టైమ్ కనెక్షన్ చుట్టూ అల్లిన కథ. దేశంలోనే తొలిసారి క్రాస్ టైమ్ కనెక్షన్ నేపథ్యంలో రాబోతున్న సినిమా కావటం విశేషం. ఆ సినిమా పేరే ‘ప్లేబ్యాక్’. 

Play back movie looks some intresting time concept jsp
Author
Hyderabad, First Published Mar 4, 2021, 1:56 PM IST

కాన్సెప్టు ఓరియెంటెడ్ కథలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి.ముఖ్యంగా ట్రైవ్ ట్రావెల్ చేసుకునే వచ్చే కాన్సెప్టు సినిమాలు అయితే మరీ కదలకుండా కూర్చుని చూడాలనిపించేలా ఉంటాయి.అలాంటి సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. సినీ లవర్స్ మద్దతు ఉంటుంది.  అయితే అలాంటి సినిమాలు తీసే దర్శకులు అరుదు. అలాంటి స్టోరీ ఐడియాలు ప్రతీసారీ దొరకవు. అంతలా విభిన్నంగా ఆలోచించరు కూడా. టైమ్ ట్రావెల్ మీద మనకు ఇప్పటికే ఆదిత్య 369,24 (సూర్య) వంటి సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. మరోసారి అలాంటి థాట్ తో ఓ సినిమా రాబోతోంది. అయితే ఆ టైమ్ ట్రావెల్ సినిమాలకు భిన్నమైన ఐడియా ఇది. ఇది క్రాస్ టైమ్ కనెక్షన్ చుట్టూ అల్లిన కథ. దేశంలోనే తొలిసారి క్రాస్ టైమ్ కనెక్షన్ నేపథ్యంలో రాబోతున్న సినిమా కావటం విశేషం. ఆ సినిమా పేరే ‘ప్లేబ్యాక్’. 

అవనూ క్రాస్ టైమ్ కనెక్షన్ అంటే ఏమిటి అంటారా..గతం నుంచి ఒకమ్మాయి భవిష్యత్తులో ఉన్న ఒకబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడ్డం అనేది ఇందులో ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రేమలో పడ్డ వీరిద్దరూ ఆ  రెండు టైం లైన్స్ ను కలపాలి అనుకుంటే ఏం జరుగుతుంది అన్న పాయింట్ తో ఈ సినిమా కథ ఉండబోతోందని తెలుస్తోంది. ఇంట్రస్టింగ్ కదా. రిలీజ్ ఎప్పుడూ అంటే..ఎప్పుడో కాదు...రేపు శుక్రవారమే. ఇలాంటి సబ్జెక్టుని డీల్ చేసిన డైరక్టర్ ఎవరూ అంటే.. హరిప్రసాద్ జక్కా.

 టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వద్ద 100% లవ్, వన్ నేనొక్కడినే చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేశారు. ముఖ్యంగా మహేశ్ బాబు నటించిన వన్ నేనొక్కడినే చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు అంటే ఆయన దగ్గర ఏ స్దాయి విషయముందో అంచనా వేయచ్చు.  ఈయన మెగాఫోన్ పట్టి ‘ప్లేబ్యాక్’ అనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

దినేష్ తేజ్, అనన్యా నాగళ్ల ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా  నటించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ పథాకంపై తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. అవకాసం ఉంటే మీరూ చూసేసి మీకూ క్రాస్ టైమ్ కనెక్షన్ ఏమన్నా దొరుకుతుందేమో ప్రయత్నించండి...

Follow Us:
Download App:
  • android
  • ios