అమ్మాయిల కన్నెతనంపై హీరోయిన్ సెన్సేషనల్ కమెంట్స్ అమ్మాయిలకు అది అవసరంలేదంటున్న రంగం 2 ఫేం పియా బాజ్ పాయ్ ఎందుకంటే నేటితరం కుర్రాళ్లు కన్నెపొర ఉండాలని కోరుకోవట్లేదట 

తమిళం నుండి తెలుగులోకి డబ్ అయిన "రంగం" సినిమాలో రెండవ హీరోయిన్ గా పియా బాజ్‌పాయ్ చేసిన అల్లరి నటనకు యువతరం ఫిదా అయ్యింది. కానీ, పియాకు మాత్రం ఆశించిన అవకాశాలు లభించలేదు. తెలుగులో కూడా ఓ రెండు, మూడు సినిమాల్లో కనిపించినా అని పెద్దగా ఆమెకిచ్చిందేం లేదు. దాంతో బాలీవుడ్ బాట పట్టింది.

బాలీవుడ్ బాట పట్టిన పియా ఊరికే ఎలా ఉంటుంది. అందుకే ఓ సంచలన ప్రకటన చేసింది. ఇంతటి బోల్డ్ స్టేట్ మెంట్ ఇస్తే ఎలా అని వెనకా ముందు ఆలోచించలేదు. ఇంతకీ పియా ఏమంటోందంటే.. ‘‘ఇప్పటి తరం కుర్రాళ్లెవరూ పెళ్లిచేసుకోవటానికి వర్జిన్(కన్య)లను కోరుకోవట్లేదు. కొద్ది మంది అలా అడుగుతున్నా.. అది కేవలం వారి పెద్దల ప్రభావం వల్లే. అందుకే చాలా మంది కన్నెపొరను తిరిగి ఏర్పాటు చేసే సర్జరీలను చిన్న చిన్న టౌన్లలో ఇంకా చేస్తున్నారు. కానీ, పెద్ద సిటీల్లో మాత్రం అవేమీ చేయట్లేదు'' అని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది పియా. ఇంకేముంది. మీడియా ఫోకస్ మొత్తం పియా మీదికి తిప్పేసింది.

ప్రస్తుతం ఆమె నటించిన ‘మీర్జా జూలియట్' సినిమా వచ్చే వారం విడుదలవుతోంది. దానికి ఊరికే పబ్లిసిటీ చేయమంటే ఎవడు చేస్తాడు. ఇదిగో ఒక్క దెబ్బతో మీర్జా జూలియట్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు అంటూ హెడ్డింగులు పెట్టేశారు మన మీడియా జనం. అసలే బికినీ సూట్ తో పిచ్చి పిచ్చిగా అందాలను ఆరబోసిన సినిమాను ఎవ్వరూ పట్టించుకోకుంటే ఎలా అనుకుందేమో... మొత్తానికి కన్యత్వంపై బోల్డ్ స్టేట్ మెంచ్ ఇచ్చి టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది.