తెలుగు, తమిళ ఆడియన్స్ ను మరోసారి భయపెట్టడానికి వచ్చేస్తుంది పిశాచి. ఫస్ట్ పిశాచి మూవీ హరర్ థ్రిల్లర్ గా ధడపుట్టేలా చేస్తే.. అంతకు మించి అన్నట్టు వచ్చేస్తోంది పిశాచి పార్ట్ 2 మూవీ. 

తెలుగు, తమిళ ఆడియన్స్ ను మరోసారి భయపెట్టడానికి వచ్చేస్తుంది పిశాచి. ఫస్ట్ పిశాచి మూవీ హరర్ థ్రిల్లర్ గా ధడపుట్టేలా చేస్తే.. అంతకు మించి అన్నట్టు వచ్చేస్తోంది పిశాచి పార్ట్ 2 మూవీ.

పిశాచి, డిటెక్టీవ్ లాంటి సినిమాలతో తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ డైరెక్టర్ మిష్కిన్. కొత్త కొత్త కథలతో పాటు, డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో అలరించే దర్శకులలో మిష్కిన్ కూడా ఒకరు. ప్ర‌స్తుతం ఈయ‌న డైరెక్ట్ చేస్తోన్న హారర్ మూవీ పిశాచి-2. ఎప్పుడో 2014లో అసలు ఎలాంటి అంచ‌నాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన పిశాచి సినిమా..విడుద‌లైన తరువాత త‌మిళ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ సక్సెస్ ను సాధించింది. ఇటు తెలుగులో కూడా థ్రిలర్స్ ను ఇష్టపడే ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అయ్యింది. 

 ఇక ఈ సినిమాకు సీక్వెల్ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకున్నారు.కాని అది ఈమధ్యే ఆచరణలోకి వచ్చింది. పిశాచి చిత్రానికి సీక్వెల్‌గా పిశాచి2 మూవీ తెరకెక్కుతోంది. హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతొన్న ఈ సినిమాను రెండేళ్ళ క్రిత‌మే మిష్కిన్ అనౌన్స్ చేశాడు. క‌రోనా కార‌ణంతో షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇక అప్పుడు సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు టీమ్. రీసెంట్ గా పిశాచి2 నుంచి అద్భతమైన టీజర్ ను రిలీజ్ చేశారు.

YouTube video player

డైరెక్టర్ కొంచెం కొత్తగా ఆలోచించాడు. ఈ సినిమా టీజర్ ను ఎలాంటి డైలాగ్స్ లేకుండా విడుద‌ల చేశారు. ఆండ్రీయా దెయ్యంలాగా ప‌రిచ‌య‌మ‌వుతూ టీజ‌ర్ ప్రారంభ‌మైంది. 1 నిమిషం 8 సెకన్ల టీజ‌ర్ అత్యంత భ‌యానికంగా ఉంది. హారర్ సీన్స్ కు తగ్గట్టు కార్తీక్ రాజా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఒక‌వైపు థ్రిల్ ఫీల్‌ను క‌లుగజేస్తూనే మ‌రోవైపు భ‌యానికి గురిచేస్తుంది. శివ శాంత‌కుమార్ కెమెరా వ‌ర్క్ అద్భుతంగా ఉంది. 

ఇక పిశాచి సినిమాను రాక్‌ఫోర్ట్ ఎంట‌ర్టైనమెంట్ ప‌తాకంపై టి. మురుగ‌నాంత‌న్ నిర్మిస్తున్నాడు. ఆండ్రీయా లీడ్ రోల్ ప్లే చేసిన ఈసినిమాలో మక్కల్ సెల్వన్, తమిళ స్టార్ యాక్టర్ విజ‌య్ సేతుప‌తి, పూర్ణ‌, కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తెలుగులో శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.