Asianet News TeluguAsianet News Telugu

Pippa Controversy: ఏఆర్‌ రెహ్మాన్‌ చేసిన పనికి క్షమాపణలు చెప్పిన `పిప్పా` మేకర్స్.. అసలేమైంది?

యంగ్‌ హీరో ఇషాన్‌ ఖత్తర్‌ హీరోగా నటించిన `పిప్పా` మూవీ వివాదంలో ఇరుక్కుంది. ఇందులోని రెహ్మాన్‌ పాటపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

pippa movie makers says sorry regards ar rehman song from movie what happened ? arj
Author
First Published Nov 14, 2023, 10:59 AM IST

యంగ్‌ హీరో ఇషాన్‌ ఖత్తర్‌ హీరోగా రూపొందిన హిందీ మూవీ గత వారం విడుదలైంది. ఇది మిశ్రమ స్పందన తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపిస్తుంది. ఈ మూవీకి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందించడంతో దీనిపై స్పెషల్‌ అటెన్షన్‌ ఏర్పడింది. అయితే రెహ్మాన్‌ కంపోజ్‌ చేసిన `కరర్‌ ఓయి లౌహో కోపట్‌` అనే పాట బాగా పాపులర్‌ అయ్యింది. వైరల్‌ అయ్యింది.

అయితే ఈ పాట ఇప్పుడు వివాదంగా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కారణం ఈ పాట ప్రముఖ బెంగాలీ రైటర్‌ నజ్రుల్‌ ఇస్లామ్‌ రాసిన ఇస్లామిక్‌ దేశభక్తి గీతం కావడమే. ఆ పాటని మార్చి `పిప్పా` సినిమాలో ఉపయోగించారు. దీంతో నెటిజన్లు, పాట అభిమానులు దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. రెహ్మాన్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో దీనిపై `పిప్పా` చిత్ర బృందం స్పందించింది. పాటని తమ సినిమాలో వాడుకోవడంపై వివరణ ఇచ్చారు. అదే సమయంలో క్షమాపణలు కూడా చెప్పారు. అయితే తాము ఆ రైటర్‌ నుంచి హక్కులను తీసుకున్నామని చెప్పారు. పాట లిరిక్‌ని మార్చుకుని ఉపయోగించుకునేలా కూడా ఆ పాట హక్కుదారులైన లేట్‌ మిస్టర్‌ కళ్యాణి కాజీ, విట్‌నెస్‌ అనిర్బన్‌ కాజీ ద్వారా అనుమతి తీసుకున్నామని, అధికారికంగా తాను కాపీ రైట్స్ తీసుకున్న తర్వాతనే ఈ పాటని తమ సినిమాలో ఉపయోగించామని తెలిపారు. 

Read More:Devara: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఖుషి అయ్యే వార్త.. `దేవర` నుంచి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

అదే సమయంలో అభిమానులు, ప్రజలు అభిప్రాయాన్ని, భావోద్వేగాలను తాను గౌరవిస్తామని, ఎవరిని కించపర్చడం తమ ఉద్దేశం కాదని, ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కూడా తమ ఉద్దేశ్యం కాదని, ఆ పాట ద్వారా తమ ఉద్దేశ్యాన్ని, సినిమా భావాన్ని మాత్రమే చెప్పాలనుకున్నామని తెలిపారు. అయినా పాట వల్ల ఇబ్బంది కలిగినందుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ప్రొడక్షన్‌ కంపెనీ రాయ్‌ కపూర్‌ ఫిల్మ్స్ నుంచి అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios