ఎన్టీఆర్ సినిమా పిక్ టాక్: వెండితెర మామాఅల్లుళ్లు..

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 13, Sep 2018, 12:50 PM IST
pic talk: the reel ntr and nara chandrababu naidu
Highlights

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. వినాయకచవితి సందర్భంగా నిన్న చిత్రబృందం సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తోన్న రానా లుక్ ని విడుదల చేశారు. తాజాగా చిత్రబృందం మరో సర్ప్రైజ్ ఇచ్చింది.

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. వినాయకచవితి సందర్భంగా నిన్న చిత్రబృందం సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తోన్న రానా లుక్ ని విడుదల చేశారు.

తాజాగా చిత్రబృందం మరో సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ గా బాలయ్య, ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడిగా రానా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని విడివిడిగా విడుదల చేశారు. ఈసారి మామా అల్లుళ్లు కలిసే వచ్చారు. పోస్టర్ లో ఎన్టీఆర్ తన అల్లుడుపై చేయి వేసి మాట్లాడుతున్నట్లుగా చూపించారు. ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్, ఏఎన్నార్ గా సుమంత్ కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. 

loader