మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. వీరిద్దరితో అక్కినేని అఖిల్ కి మంచి బాండ్ ఉంది. చరణ్ తో స్నేహంగా ఉండే అఖిల్, తారక్ ని అన్న అని పిలుస్తుంటాడు.

ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రీసెంట్ గా అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరైన ఎన్టీఆర్ సినిమా హిట్ కావాలని కోరుకుంటూ అఖిల్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.

టాలీవుడ్ లో ఫైనెస్ట్ నటుల్లో అఖిల్ ఒకడవుతాడని, ఆ రోజు తొందర్లోనే వస్తుందని చాలా నమ్మకంగా చెప్పాడు. అయితే అదే రోజు రాత్రి ఎన్టీఆర్, అఖిల్ లను పెర్సనల్ గా కలిశాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా ముగ్గురు కలిసి ఓ ఫోటో దిగారు.

ఈ ఫోటోని బట్టి వాళ్ల మధ్య అనుబంధం ఎంత స్ట్రాంగ్ అనే విషయం తెలుస్తోంది. ప్రస్తుతం తారక్, చరణ్ లు కలిసి 'RRR' సినిమాలో నటిస్తున్నారు. ఇక అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.