జెమినీ గనేశణ్ ఏడుగురు కూతుర్లు ఒకే ఫ్రేములో!

photo story about gemini ganeshan daughters
Highlights

'మహానటి' సినిమా తరువాత సావిత్రి, జెమినీ గనేషన్ ల గురించి మరిన్ని 

'మహానటి' సినిమా తరువాత సావిత్రి, జెమినీ గనేశణ్ ల గురించి మరిన్ని వివరాలు సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సావిత్రి మరణం తరువాత ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయనే తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. దీనికి సంబంధించి ఆన్ లైన్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో దర్శనమిస్తోంది. అందులో జెమినీ గనేశణ్ ఏడుగురు కూతుర్లు ఒకే ఫ్రేములో కనిపిస్తుండడంతో ఆ ఫోటో కాస్త వైరల్ అయింది. 

జెమినీ గనేశణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొత్తం ఆయనకు ఏడుగురు కూతుర్లు, ఒక కొడుకు. సావిత్రి ఆయనకు మూడవ భార్య ఆమెకు పుట్టినవారే విజయ ఛాముండేశ్వరి, సతీష్ లు. రెండవభార్య పుష్పవల్లికి ఇద్దరు కుమార్తెలు. అందులో బాలీవుడ్ తార రేఖ ఒకరు.

మొత్తం ఏడుగురు అక్కజెల్లెల్లు ఒక ఈవెంట్ లో పాల్గొని కలిసి ఫోటో తీసుకున్నారు. వారి మధ్య ఉన్న అనుబంధానికి ఈ ఫోటో అద్దం పడుతోంది. కమల సెల్వరాజ్, రేఖా, నారాయణి, రేవతి, రాధ, విజయ ఛాముండేశ్వరి, జయ శ్రీధర్ అందరూ ఈ ఫోటోలో కనిపిస్తున్నారు.  

loader