Asianet News TeluguAsianet News Telugu

Adipurush : ‘ఆదిపురుష్’ టీజర్ పై కోర్టులో పిటిషన్.. ఏమని ఫిర్యాదు చేశారంటే?

పాన్ ఇండియా  స్టార్ ప్రభాస్ - బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషనల్ లో వస్తున్న హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’. ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన టీజర్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తాజాగా కోర్టులోనూ పిటిషన్ దాఖలైంది.
 

Petition in court on Adipurush teaser, What is the complaint?
Author
First Published Oct 7, 2022, 4:21 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’(Adipurush). హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పటి నుంచో ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు, మరియు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దసరా సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ను రిలీజ్ చేశారు. భారీ హైప్ క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన టీజర్ మాత్రం వివాదాలకు దారి తీసింది.

వాల్మీకీ రచించిన రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పాత్రలన్నీ వాస్తవానికి భిన్నంగా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు చిత్రం వీఎఫ్ఎక్స్ కూడా గ్రాండ్ గా లేవంటూ ట్రోల్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ ఆదిపురుష్ టీజర్ పై విపరీతంగా ట్రోల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు బ్రాహ్మణులు సైతం చిత్రంలోని పాత్రలను తప్పుగా చూపిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘ఆదిపురుష్’టీమ్ కు మరో షాక్ తగిలింది.

‘ఆదిపురుష్’ టీజర్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. తాజా సమాచారం ప్రకారం..  ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రమోద్ పాండే అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాలోని నటీనటులు, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని, హనుమంతుడిని, రాముడిని నెగెటివ్ గా చూపిస్తున్నారని పిటిషనల్ లో పేర్కొన్నారు. అంతకుముందే లక్నో పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. 

దీంతో ‘ఆదిపురుష్’ టీజర్ వివాదం మరింతగా పెరుగుతోంది. భారీ అంచనాలతో వచ్చిన అప్డేట్స్ పూర్తిగా విమర్శలకు దారితీస్తోంది. కానీ ఆదిపురుష్ త్రీడీ టీజర్ కాస్తా పర్లేదనే మాట వినిపిస్తోంది. ట్రోలింగ్ తర్వాత కూడా వీఎఫ్ఎక్స్ ను మోడీఫై చేసినట్టుగా తెలుస్తోంది. మున్ముందు వచ్చే అప్డేట్స్ కచ్చితంగా నచ్చుతాయని చిత్ర యూనిట్ ఆశిస్తోంది. మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా క్రితిసనన్ నటిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంతో వహిస్తున్నారు. భూషన్ కుమార్, కిషన్ కుమార్, రాజేష్ మోహనన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. 2023 జనవరి 12న  ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios