ఈ మధ్యకాలంలో సినిమాలు, టీవీ కార్యక్రమాలకు సంబంధించి కేసులు బాగా ఎక్కువయ్యాయి. సినిమాలో సన్నివేశాలు, తారలు వేసుకునే బట్టలు ఇలా ఏదొక అంశాన్ని పట్టుకొని అభ్యంతరాలు చెబుతూ సెలబ్రిటీలను కోర్టుకి లాగుతున్నారు.

తాజాగా బిగ్ బాస్ షోపై కూడా కొందరు కోర్టులో పిటిషన్ వేశారు. వివరాల్లోకి వెళితే.. కమల్ హాసన్ హోస్ట్ గా తమిళ  బిగ్ బాస్ సీజన్ 3 మొదలవ్వనుంది. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన ప్రోమోలు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే షో మొదలుకానుంది.

అయితే ఈ కార్యక్రమం తీరు సరిగాలేదని, అందులో పాల్గొనేవారు పొట్టి దుస్తుల్లో ఉంటారని, వారు వ్యవహరించే తీరు పిల్లలను తప్పుదోవ పట్టించేలాఉంటుందని.. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఆపాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలైంది.

తమిళ ఇండస్ట్రీలో ఇలాంటి పిటిషన్లు చాలా కామన్. మరి దీనిపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!