సావిత్రి కులం తేల్చేదాకా వదల్లేదు!

సావిత్రి కులం తేల్చేదాకా వదల్లేదు!

ప్రాంతీయ బేధాల సంగతి పక్కన పెడితే దాదాపు తెలుగువారందరికీ కూడా కులం పిచ్చి అనేది కామన్. అప్పుడే కలిసిన ఇద్దరు తెలుగు వాళ్ళు మాట్లాడుకుంటే రెండో నిమిషం అడిగేది 'మీది ఏం కాస్ట్' అనే.. మరి అంతగా కులం తెలుసుకోవాలనే ఆసక్తి  ఎందుకుంటుందో అర్ధంకాని విషయం. తాజాగా చోటుచేసుకున్న ఓ సంఘటన మనకి కులం మీద ఉన్న ఆసక్తికి అద్దం పడుతోంది. 'మహానటి' సావిత్రి సినిమా విడుదలైన తరువాత సావిత్రి కులం ఏంటో తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నించారు.

నలభై ఏళ్ల క్రితం చనిపోయిన నటి కులం ఇప్పుడు ప్రస్తావనలోకి వచ్చింది. సావిత్రి కమ్మ వర్గానికి చెందిన మహిళ అంటూ కొందరు కన్ఫర్మ్ చేసేసారు. కాదు ఆమె కాపు వర్గానికి చెందిన వారంటూ మరికొందరు వాదిస్తున్నారు. దీనికోసం గూగుల్ లో తెగ సెర్చ్ చేశారు. ఎన్నో బాధలను భరించి కోమాలోకి వెళ్ళిన ఆమెను ఆదరించడానికి గుర్తుకురాని కులం ఆమె చనిపోయిన తరువాత ఇన్నాళ్ళకు చర్చించుకోవడం దురదృష్టకరం.

మొత్తానికి ఏదైతేనేం సావిత్రి కులం తేల్చేదాకా వదల్లేదు కొందరు నెటిజన్లు. నిజానికి సావిత్రి కాపు వర్గానికి చెందిన మహిళే.. కానీ ఆమె చిన్నప్పటినుండి పెదనాన్న ఇంట్లో పెరుగుతుంది. అతడిని 'మహానటి'లో చౌదరిగా చూపించారు. దీంతో సావిత్రి కాపు అయితే పెదనాన్న చౌదరి ఎలా అవుతాడనే సందేహం కొందరిలో మెదిలింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సావిత్రి పెద్దమ్మ కమ్మ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక సావిత్రి తమిళ బ్రాహ్మణ అయిన జెమినీ గనేషన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వీటిలో ఏ ఒక్క కులం కూడా ఆమెను బాధల నుండి కష్టాల నుండి బయటపడేలా చేయలేకపోయింది. కులం కూడు పెట్టదని పెద్దలు ఊరికే అనలేదు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page