గత ఏడాది విడుదలైన ' పెళ్లి సందD' చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. Sreeleela అందానికి ఫిదా కాని కుర్రాళ్లంటూ లేరు. పాల మేను లాంటి దేహంతో ఈ చిత్రంలో మతిపోగొట్టేలా శ్రీలీల అందాలు ఆరబోసింది.

గత ఏడాది విడుదలైన ' పెళ్లి సందD' చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. Sreeleela అందానికి ఫిదా కాని కుర్రాళ్లంటూ లేరు. పాల మేను లాంటి దేహంతో ఈ చిత్రంలో మతిపోగొట్టేలా శ్రీలీల అందాలు ఆరబోసింది. దర్శకేంద్రుడు Raghavendra Rao ఇన్వాల్వ్ మెంట్ ఉండే చిత్రాల్లో హీరోయిన్లని ఎలా చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. 

ఈ చిత్రం విడుదలైనప్పుడు మిశ్రమ స్పందన లభించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఏకమా 10 కోట్ల పైనే వసూళ్లు రాబట్టి ట్రేడ్ ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ వసూళ్లకు కారణం హీరోయిన్ శ్రీలీల గ్లామర్ అని అంటున్నారు. ఈ చిత్రంలో కుర్ర భామ అందాలు యువతని విశేషంగా ఆకట్టుకున్నాయి. 

కేవలం అందం మాత్రమే కాదు చలాకీగా ఉంటూ నటనలో సైతం మెప్పించింది. చూస్తూ ఉండిపోవాలనిపించేలా డాన్స్ తో సైతం ఆకట్టుకుంది. ఫలితంగా యువత శ్రీలీల కోసం థియేటర్స్ కి ఎగబడ్డారు. దీనితో తొలి చిత్రంతోనే తన సత్తా ఏంటో పసిగట్టేసింది ఈ భామ. ప్రస్తుతం శ్రీలీలకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. దీనితో శ్రీలీల రెమ్యునరేషన్ అమాంతం పెంచేసినట్లు టాక్. 

ప్రస్తుతం శ్రీలీల మూడు క్రేజీ ఆఫర్లు అందుకున్నట్లు తెలుస్తోంది. అందులో రవితేజ, నవీన్ పోలిశెట్టి తదుపరి చిత్రాలు ఉన్నాయి. తొలి చిత్రం కోసం 5 లక్షల లోపే రెమ్యునరేషన్ అందుకున్న శ్రీలీల.. ప్రస్తుతం రూ.1 కోటి వరకు డిమాండ్ చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట. టాలీవుడ్ లో కోటి పారితోషికం అందుకునే హీరోయిన్లు తక్కువమందే ఉన్నారు. కానీ శ్రీలీల తనకున్న డిమాండ్ ని అర్థం చేసుకుని అంత పారితోషికం అందుగుతున్నట్లు టాక్.