Asianet News TeluguAsianet News Telugu

‘పెద్దన్న’తెలుగులో ఎంతకు కొన్నారు,నష్టం ఎంత?

 దర్శకడు శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలని ఫ్యాన్స్ అంతా ఎక్సపెక్టేషన్స్ పెంచేసుకున్నారు. అయితే మరీ పాత కాలం స్క్రిప్టు కావటంతో డైరక్టర్ కు ఆ అవకాసం రాలేదు.  
 

Peddanna a solid 8 Crore loss
Author
Hyderabad, First Published Nov 7, 2021, 3:19 PM IST

రజనీకాంత్.. తాజా చిత్రం ‘అన్నాత్తే’..తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ అయ్యిన సంగతి తెలిసిందే. దీపావళీ పండగ సందర్భంగా  ఈ సినిమా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నయనతార, కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బు తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన  ఈ చిత్రం మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. దర్శకడు శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలని ఫ్యాన్స్ అంతా ఎక్సపెక్టేషన్స్ పెంచేసుకున్నారు. అయితే మరీ పాత కాలం స్క్రిప్టు కావటంతో డైరక్టర్ కు ఆ అవకాసం రాలేదు.  దర్శకుడు శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నా ఈ సినిమా ఆయన దారుణ ఫలితాన్ని  ఇచ్చింది.

ఇక ఈ చిత్రం తెలుగు రైట్స్ ని 12 కోట్లుకు పెట్టి తీసుకున్నారు. 12.5 కోట్లు కు అమ్మారు.  13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. నిజానికి సూపర్ స్టార్ సినిమాకు అదేమీ పెద్ద మొత్తం కాదు. ఒకప్పుడు తెలుగులో ఆయన సినిమాలకు ఓ రేంజిలో డిమాండ్ ఉండేది. కానీ వరసగా రజని సినిమాలు ఫ్లాఫ్ కావటంతో ఈ సినిమాకు పెద్దగా రేటు పలకలేదు. అయితే అంత తక్కువ రేటుకు సినిమాని తీసుకున్నా ఫలితం లేదు. 

డిజాస్టర్ టాక్ రావటం, దారుణంగా వచ్చిన రివ్యూలు సినిమాకు భారీ లాస్ తెచ్చిపెట్టాయి. రజనీకాంత్ బ్రాండ్ వాల్యూ కూడా భాక్సాఫీస్ దగ్గర ఓపినింగ్స్ రప్పించలేకపోయింది. దాంతో సినిమాకు నాలుగు కోట్లు మాత్రమే రికవరీ అయ్యే అవకాసం ఉందని సమాచారం. సాలిడ్ గా ఎనిమిది కోట్లు నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు.  తమిళనాడు సింగిల్ స్క్రీన్స్ లో ఈ సినిమా బాగానే వర్కవుట్ అవుతోందంటున్నారు. అక్కడ నిర్మాతలు సేఫ్ కానీ తెలుగు నిర్మాతలే పూర్తి లాస్ అని తేలింది. 

ఇక అన్నాత్తే కంటే ముందు రజనీ దర్భార్ అంటూ వచ్చాడు. మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాను స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించింది. చెల్లిలు సెంటిమెంట్ తో ఈ సినిమా రూపొందింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios