కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో రిలీజైన సంగమిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ పీసీ సుందర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగమిత్ర సంగమిత్ర రాణిగా నటిస్తున్న శృతీహాసన్ సోషల్ మీడియాకెక్కిన సంగమిత్ర కథ

బాహుబలి2 తర్వాత దక్షిణాదిలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం సంఘమిత్ర. అందమైన హీరోయిన్ శృతిహాసన్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రానికి పీసీ సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ చేస్తున్నారు. శృతిహాసన్‌తోపాటు చిత్ర యూనిట్ కేన్స్ సినిమా పండుగకు హాజరైంది.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన కథ రైటప్‌ను ప్రముఖ ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ప్రకారం.. సంఘమిత్ర 8వ శతాబ్దం కాలం నాటి కథ. రాణి సంఘమిత్ర జీవితంలో ఒడిదుకుడుకులు ప్రధాన కథ. శత్రువుల దాడికి గురైన సామ్రాజ్యాన్ని రక్షించుకోవడానికి అందాల యువరాణి చేసిన పోరాటమే ఈ కథా నేపథ్యం. ఈ కథలో ఎందరో రాజులు, ఎన్నో సామ్రాజ్యాలు, దేశాలు, వారి ఎత్తులు పైఎత్తులు, ఆయా దేశాల మధ్య మైత్రి, శృత్వత్వంలో కథలో భాగమైన అనేక కోణాలు. ఇలాంటి అంశాలను వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతున్నది.

సంఘమిత్ర కేవలం కల్పిత కథ. చరిత్రలోని కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని అల్లుకొన్న కథ. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని శృతిహాసన్ పాత్రకు సంబంధించిన ఫొటోలు విడుదలయ్యాయి. వాటికి ఇంటర్నెట్‌లో విపరీతమైన స్పందన వస్తోంది.

సంఘమిత్ర పాత్రను పోషిస్తున్న శృతిహాసన్‌కు ఈ సినిమా విడుదలకు ముందే ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫెస్టివల్‌లో పాల్గొనే ఛాన్స్‌ దక్కింది. కేన్స్‌ ఉత్సవాల మొదటి రోజున ఈ ప్రాజెక్ట్‌ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జయం రవి, ఆర్య, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను కేన్స్ నిర్వాహకులు విడుదల చేశారు.

కేన్స్ వేడుకల్లో దర్శకుడు పీసీ సుందర్ మాట్లాడుతూ.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సంఘమిత్రను ఆవిష్కరించడం గర్వంగా ఉంది. ఇది దర్శకుడిగా నాకు దక్కిన అపురూపమైన గౌరవం. ఈ కార్యక్రమంలో నా నిర్మాతలు, నటీనటులు నా వెంట ఉండటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడం అదృష్టం. ఈ చిత్రం నా సినీ జీవితానికి సవాల్ లాంటింది. ఇది నాకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అని అన్నారు.

సంఘమిత్ర చిత్రం కోసం ఇప్పటికే శృతిహాసన్ కసరత్తు ప్రారంభించింది. యుద్ధ పోరాటాలకు సంబంధించిన శిక్షణ, కత్తిసాము లాంటి విద్యలో మెలకువలపై ఆమె దృష్టిపెట్టింది. అలాగే జయం రవి, ఆర్య, ఇతర పాత్రధారులు తమ తమ పాత్రలకు అనుగుణంగా కసరత్తు ప్రారంభించారు.