సినిమా పరిశ్రమలో ఉన్న ఎవరైనా సరే ఇతర సినిమాలు ప్లాప్ అయితే స్పందించడమనేది చాలా తక్కువ కానీ ఆర్ఎక్స్100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఇటీవల సినిమా రిజల్ట్ పై స్పందించిన తీరు షారుక్ ఖాన్ అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తోంది. 

సినిమా పరిశ్రమలో ఎవరైనా సరే ఇతర సినిమాలు ప్లాప్ అయితే స్పందించడమనేది చాలా తక్కువ కానీ ఆర్ఎక్స్100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఇటీవల సినిమా రిజల్ట్ పై స్పందించిన తీరు షారుక్ ఖాన్ అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఎన్నో అంచనాల నడుమ ఈ నెల 21న విడుదలైన షారుక్ ఖాన్ జీరో సినిమా ఫైనల్ గా డిజాస్టర్ అని తేలిపోయింది. 

మొదటి షోకే ఆడియెన్స్ లో నిరాశ క్లియర్ గా కనిపించింది. దీంతో వరుసగా కలెక్షన్స్ డౌన్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల సినిమా చూసిన పాయల్ రాజ్ పుత్ తన సన్నిహితురాలితో కలిసి డిఫరెంట్ హావభావాలను చూపించి గేలి చేసింది. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అంతే కాకుండా జీరో చూసిన తరువాత పెచ్చెకిందని కామెంట్ చేయడంతో అమ్మడిపై షారుక్ ఫ్యాన్స్ అలాగే ఇతర నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క సినిమా హిట్టయితే మరి అంత ఓవర్ యాక్షన్ అవసరమా? అంటూ మండిపడుతున్నారు.

View post on Instagram