ఉత్తరాది భామ పాయల్ రాజ్‌పుత్‌ 'ఆర్‌ఎక్స్‌ 100' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని తన సత్తా చాటింది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో టాలీవుడ్ లో పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది.

ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలతో ఇన్స్టాగ్రామ్ ని షేక్ చేసే ఈ బ్యూటీ తాజాగా ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె ఓ వ్యక్తి పక్కన కూర్చొని ఉంది. ఈ ఫోటోకి మూడు ప్రేమ గుర్తులను జత చేసింది. దీంతో ఈ ఫోటో చూసిన వారు అతడు పాయల్ బాయ్ ఫ్రెండ్ అని ఫిక్స్ అయిపోయారు.

పైగా మరో నటి, పాయల్ స్నేహితురాలు అర్చనా గుప్తా 'మై ఫేవరెట్ లవ్ బర్డ్స్' అని కామెంట్ పెట్టింది. దానికి పాయల్ ప్రేమ గుర్తులతో బదులిచ్చింది. దీంతో అతడు పాయల్ బాయ్ ఫ్రెండ్ అనే విషయం కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ఫోటో, కామెంట్ చూసిన నెటిజన్లు పాయల్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

కానీ పాయల్ ఇప్పట్లో ఆ వ్యక్తి ఎవరో చెప్పేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ 'వెంకీ మామ' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో వెంకీకి జోడీగా కనిపించనుంది. ఈ సినిమాతో పాటు 'ఆర్‌డీఎక్స్‌', 'డిస్కో రాజా' అనే సినిమాల్లో నటిస్తోంది.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🖤💟🖤

A post shared by Payal Rajput (@rajputpaayal) on Jul 22, 2019 at 5:16am PDT