పాయల్ న్యూడ్ ఫోటో వెనుక అంత కథ ఉందా?.. నిజంగా షాకే.. సీక్రెట్ వెల్లడి
పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం `మంగళవారం` సినిమాలో నటించింది. ఇందులో పాయల్ న్యూడ్ ఫోటో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఈ ఫోటో వెనుక సీక్రెట్ బయటపెట్టాడు దర్శకుడు.

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించిన `ఆర్‌ఎక్స్ 100` చిత్రం పెద్ద హిట్ అయ్యింది. అందులో ఆమె పాత్ర బోల్డ్ గా ఉంది. చివర్లో పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. దీంతో ఇప్పుడు అదే దర్శకుడు అజయ్ భూపతితో `మంగళవారం` సినిమా చేస్తున్న నేపథ్యంలో ఆమె పాత్ర అలానే ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇటీవల విడుదల విడుదలైన ట్రైలర్ ఇంటెన్స్ గా, బోల్డ్ గా ఉంది. అనేక సస్పెన్స్ అంశాలతో సాగుతుంది. దీంతో సినిమా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.
దీనికితోడు సినిమా ప్రారంభంలో పాయల్ న్యూడ్ ఫోటో వదిలారు. అది పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మళ్లీ సినిమాలో స్టఫ్ ఉంటుందని భావించారు. ట్రైలర్‌లో కొన్ని సీన్లని చూసి అలాంటి స్టఫ్ బాగానే ఉంటుందని భావించారు. కానీ అసలు విషయం బయటపెట్టారు దర్శకుడు అజయ్ భూపతి. ఈ మూవీ ఈ నెల 17న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ, ఆ న్యూడ్ ఫోటో వెనుక పెద్ద స్టోరీఉందన్నారు. చూడ్డానికి అది అందులో పాయల్ న్యూడ్‌గా కనిపించినా, ఆమె కళ్లల్లో మాత్రం కన్నీళ్లు ఉన్నాయని, అది కొద్ది మంది దర్శకులు గమనించి తనతో ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు.
దీనిపై అజయ్ భూపతి చెబుతూ, `ఆర్ఎక్స్ 100` సినిమాలో ఏవేవో ఉంటాయని చాలా మంది ఊహించుకున్నారు. 'మంగళవారం'లో జీరో ఎక్స్‌పొజింగ్. నా జీవితంలో ఒక్క వల్గర్ షాట్ తీయలేదు. పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... న్యూడ్ అని కొందరు అన్నారు. కానీ, అందులో గమనిస్తే... కళ్ళలో ఏడుస్తూ ఉంటుంది. ఆ గాఢత చూసే వాళ్ళకు తెలుస్తుంది. ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద దర్శకులు ఫోన్ చేసి 'బ్యాక్ చూద్దామని పోస్టర్ ఓపెన్ చేస్తే కళ్ళ మీదకు తీసుకువెళ్ళావ్' అని అన్నారు. థియేటర్ల నుంచి వచ్చే ప్రేక్షకులు ఏడుస్తూ వస్తారు. ఆమెను చూసి ఫీల్ అవుతారు` అని తెలిపారు దర్శకుడు.
పాయల్‌ని ఎలా తీసుకున్నారనేది చెబుతూ, ముందుగా పాయల్ అనుకోలేదట. `టీనేజ్ ఎండింగ్ లో ఉన్న అమ్మాయితో చేద్దామని అనుకున్నా. ఎటువంటి అంచనాలు లేని కొత్తమ్మాయిని తీసుకుందామని ప్రయత్నించా. సుమారు 40, 50 మందిని ఆడిషన్ చేశా. పెర్ఫార్మన్స్ చేయాలి, ఇన్నోసెంట్ ఫేస్ ఉండాలి, గ్రామీణ నేపథ్యానికి ఆ అమ్మాయి సూటవ్వాలి. ప్రీ ప్రొడక్షన్ టైంలో హీరోయిన్ సెలెక్షన్ కోసం ఎక్కువ టైం పట్టింది. ఆ సమయంలో పాయల్ నుంచి మెసేజ్ వచ్చింది. మళ్ళీ మనం సినిమా చేద్దామని! రెండు రోజులు టైం తీసుకుని నేను విజువలైజ్ చేసుకున్నా. సెట్ అవుతుందా? లేదా? అని! ఆ తర్వాత ఓకే చేశా` అని చెప్పారు.
సినిమా ఎలా స్టార్ట్ అయ్యిందనేది చెబుతూ,'మహాసముద్రం' చిత్రీకరణలో ఉండగా, `మంగళవారం` చేయాలని ఫిక్స్ అయ్యాను. మరొక కథపై మనసు వెళ్ళలేదు. ఇంతకు ముందు రెండు సినిమాల కంటే కథ రాసేటప్పుడు, తీసేటప్పుడు ఎక్కువ టెన్షన్ ఫీలయ్యా. కాంటెంపరరీ కథతో క్యారెక్టర్ బేస్డ్ సినిమాగా కమర్షియల్ విలువలతో తీశా. నెక్స్ట్ లెవల్ లో ఎండ్ అవుతుంది. ఇటువంటి సినిమాకు దర్శకత్వం వహించడం అంత సులభం కాదు. ప్రొడక్షన్ అండ్ టెక్నికల్ వేల్యూస్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ వంటివి చాలా ఉంటాయి. విజువలైజేషన్ నాకు తప్ప సినిమాటోగ్రాఫర్ కి కూడా తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ కి కూడా అంతే! సినిమాకు అన్నీ కుదిరాయి` అని అన్నారు.
ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అల్లు అర్జున్ ప్రశంసలపై స్పందిస్తూ, సినిమా రేంజ్ నేను ముందు ఊహించకపోతే 20 కోట్లు ఖర్చు పెట్టను. మేం పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. అన్ని ఏరియాల బిజినెస్ పూర్తి అయ్యింది. మేం చాలా హ్యాపీ. అజయ్ భూపతి ఇంత ఖర్చు చేస్తున్నాడేంటని బయట వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ, నేను అనుకోలేదు. ఒక షెడ్యూల్ అయ్యేసరికి ఈ సినిమా కెపాసిటీ నాకు తెలిసింది. ఏ దర్శకుడికి అయినా ముందు తెలుస్తుంది. అల్లు అర్జున్ గారికి ఏడాదిన్నర క్రితమే కథ చెప్పాను కాబట్టి ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో ఆయన ఊహించార`ని తెలిపారు.