చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయిన ‘Rx 100’ సినిమాతో గ్లామర్ నటిగా పేరు తెచ్చుకుంది పాయల్ రాజ్‌పుత్. ఈ  సినిమాలో బోల్డ్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈమెకు ఆఫర్స్ వరసపెట్టడంలో వింతేముంది. ముఖ్యంగా Rx 100 సినిమా రూపాయికు పదిరూపాయలు లాభాన్ని రాబట్టిందంటే.. క్రెడిట్‌ ఈ హీరోయిన్‌కి దక్కాల్సిందే అని అందరూ తేల్చి చెప్పేసారు. తెలుగులో నటించిన తొలి చిత్రంతోటే బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుని యూత్‌లో మంచి ఫాలోయింగ్ రాబట్టిన ఈమెపై వస్తున్న రూమర్స్ కు కూడా కొదవలేదు. 

తాజాగా ఆమె ర‌వితేజ స‌ర‌స‌న నటించే ఛాన్స్ కొట్టేసింది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా , ఒక్క క్షణం ‘చిత్రాల దర్శకుడు వి .ఐ ఆనంద్ త్వ‌ర‌లో ర‌వితేజ‌తో ఓ మూవీ ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో  హీరోయిన్‌గా ఆర్ఎక్స్ 100 భామ పాయ‌ల్‌ని ఎంపిక చేశారు. ఇందులో పాయ‌ల్ పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుంద‌టని... దృష్టిలోపంతో పాటు వినికిడి లోపం ఉన్న మ‌హిళ‌గా పాయ‌ల్ క‌నిపించ‌నుంద‌ని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం అంత సీన్ ఏమీ లేదట. ఇది మీడియా పుట్టించిన పుకారే అని తెలుస్తోంది. 

నేల టికెట్టు’ నిర్మాత రవి తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రానికి డిస్కో రాజా అనే టైటిల్ పరిశీలనలో ఉండ‌గా, ఇందులో ద్విపాత్రిభిన‌యం పోషించ‌నున్నాడ‌ట మాస్ రాజా. అందులో ఒకటి కొడుకు పాత్ర కాగా మరొకటి తండ్రి పాత్ర అని తెలుస్తుంది . 

ముగ్గురు హీరోయిన్లుకు ప్రాధాన్యం వున్న ఈ చిత్రంలో పాయిల్ తో పాటు ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నాబా నటేష్ ను మరొక హీరోయిన్ గా ఎంపిక చేశారు. మ‌రోత్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ చిత్రంలో సునీల్ కూడా ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడ‌ని అంటున్నారు.   థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తాడ‌ని అంటున్నారు.