బోల్డ్ అండ్ సస్పెన్స్ తో వణుకు పుట్టించేలా 'మంగళవారం' ట్రైలర్.. పాయల్ రాజ్ పుత్ పెర్ఫార్మెన్స్ విశ్వరూపమే
ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ కి ఆ రేంజ్ హిట్ పడలేదు. దీనితో మరోసారి ఆర్ఎక్స్ 100 దర్శకుడినే నమ్ముకుంది పాయల్. వీరిద్దరి కాంబోలో రెండోసారి తెరకెక్కుతున్న చిత్రం మంగళవారం.

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ కి ఆ రేంజ్ హిట్ పడలేదు. దీనితో మరోసారి ఆర్ఎక్స్ 100 దర్శకుడినే నమ్ముకుంది పాయల్.
వీరిద్దరి కాంబోలో రెండోసారి తెరకెక్కుతున్న చిత్రం మంగళవారం. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈసారి అజయ్ భూపతి లవ్ స్టోరీ కాకుండా వెరైటీగా ప్రయత్నించాడు. తాజాగా మంగళవారం చిత్ర ట్రైలర్ విడుదలయింది. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం హర్రర్, సూపర్ నాచురల్ అంశాలతో తెరకెక్కినట్లు అనిపిస్తోంది.
ట్రైలర్ దాదాపు మూడు నిమిషాల నిడివితో విడుదలయింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా వణుకు పుట్టించే సన్నివేశాలతో ట్రైలర్ ఉంది. ఒక ఊరిలో వింత సమస్య ఉన్నట్లు చూపించే సన్నివేశాలతో ట్రైలర్ మొదలవుతుంది. చినప్రతాప రాజుకి, పక్కింటి మేరీకి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని ఊరంతా పెద్దమనసుతో అర్థం చేసుకోండి అంటూ అజ్ఞాత వ్యక్తి గోడలపై రాస్తుంటాడు. అతడు ఎవరు అని ఊరి జనం భయానికి గురవుతుంటారు.
రాత్రి వేళలో ఊరిలో జరిగే సంఘటనలు వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటాయి. మధ్యలో అజయ్ భూపతి మార్క్ బోల్డ్ శృంగార సన్నివేశాలు కూడా ఉంటాయి. మంగళవారం మంగళవారం ఊళ్ళో ఇందేందిరా కొత్త భాగోతం అంటూ అజయ్ ఘోష్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. అదే సమయంలో ఊళ్ళో ప్రతి మంగళవారం మరణాలు సంభవిస్తుంటాయి. దానికి కారణం అంతు చిక్కదు. ట్రైలర్ సగం గడిచిన తర్వాతే పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ ఇస్తుంది.
మొదట క్లాసీ గా కనిపించిన పాయల్ ఆ తర్వాత బోల్డ్ శృంగార సన్నివేశాలతో రెచ్చిపోయింది. అంతే కాదు ఎమోషనల్ గా, భయాన్ని కలిగించే విధంగా పాయల్ విశ్వరూపం ప్రదర్శించింది అనే చెప్పాలి. ఊళ్ళో జరుగుతున్న సంఘటనలకు పాయల్ కి లింక్ ఏంటి అనేది సినిమా చూసే తెల్సుకోవాలి. శృంగార సన్నివేశలతో పాటు పాయల్ ఒకచోట ఒంటరిగా ఆరుబయట నగ్నంగా బాత్ టబ్ లో ఉండడం.. వింతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రావడం చూస్తుంటే సినిమాపై ఉత్కంఠ పెరిగిపోతోంది.