ఆర్ఎక్స్ 100 చిత్రంతో కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టించింది పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్. తొలి చిత్రంలోనే బోల్డ్ రోల్ లో నటించే ఎలాంటి పాత్రలకైనా సిద్ధం అంటూ దర్శక నిర్మలకు సిగ్నల్స్ పంపింది. కాజల్ అగర్వాల్ 'సీత' చిత్రంలో ఐటెం సాంగ్ కూడా చేసేసింది. 

అంతా ఊహించినట్లుగానే పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం మంచి అవకాశాలు అందుకుంటోంది. వెంకటేష్ వెంకీ మామ, రవితేజ డిస్కో రాజా చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ మరింతగా పెంచుతోంది. తాజాగా ఓ ఫోటో షూట్ లో పాల్గొన్న పాయల్ రాజ్ పుత్ కుర్రకారుని సమ్మోహన పరిచేలా నడుము అందాలని ప్రదర్శిస్తోంది. 

పాయల్ రాజ్ పుత్ ఖాతాలో మరికొన్ని విజయాలు చేరితే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లీగ్ లోకి చేరడం ఖాయం. ఓ జ్యువెలరీ యాడ్ కోసం పాయల్ రాజ్ పుత్ లెహంగా లో ఈ ఫోటో షూట్ లో పాల్గొంది.