తెలుగులో పాయల్ రాజ్ పుత్ నటించిన తొలి చిత్రం ఆర్ఎక్స్ 100. తొలి చిత్రంతోనే కుర్రకారుని పాయల్ తనవైపుకు తిప్పుకుంది. ఆ చిత్రం తర్వాత పాయల్ రాజ్ పుత్ కు పలు అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ ఆర్డీఎక్స్ లవ్ చిత్రంతో పాటు రవితేజ సరసన డిస్కోరాజా, వెంకటేష్ సరసన వెంకీ మామ చిత్రాల్లో నటిస్తోంది. 

ఆ మధ్యన పాయల్ రాజ్ పుత్ వెంకటేష్ కు దూరంగా నిల్చుకుని షేక్ హ్యాండ్ ఇస్తున్న వీడియో వైరల్ అయింది. వెంకటేష్ లాంటి స్టార్ హీరో పట్ల పాయల్ రాజ్ పుత్ కు గౌరవం లేదని ట్రోలింగ్ జరిగింది. తాజగా ఓ ఇంటర్వ్యూలో పాయల్ రాజ్ పుత్ ఈ వివాదం గురించి క్లారిటీ ఇచ్చింది. 

ఆ సమయంలో నేను ఓ చేత్తో తింటున్నా. అలాంటప్పుడు వెంకటేష్ సర్ ని కౌగిలించుకుంటే బావుంటుందా.. అందుకే దూరంగా నిలబడే షేక్ హ్యాండ్ ఇచ్చా అని తెలిపింది. 

కానీ అది అర్థం చేసుకోకుండా ఈ అమ్మాయికి ఎంత పొగరు అంటూ కామెంట్స్ చేశారు. సాధారణంగా నేను విమర్శలని పట్టించుకోను. కానీ తన తప్పు లేకపోయినా ఇలాంటి కామెంట్స్ చేయడం హర్టింగ్ గా ఉంటుందని పాయల్ తెలిపింది.