నేటి బిగ్ బాస్ షోని సరికొత్తగా ముస్తాబు చేశారు నిర్వాహకులు. నాగార్జున లేని లోటు పూడ్చడంతో పాటు దసరా పండుగను పురస్కరించుకొని బిగ్ బాస్ వేదికను మరింత ఫన్, ఎంటర్టైన్మెంట్ తో సిద్ధం చేశారు. అక్కినేని వారి కోడలు సమంత హోస్ట్ గా మారగా...పాయల్, కార్తికేయ, హైపర్ ఆదిలతో పాటు యంగ్ హీరో అఖిల్ సైతం బిగ్ బాస్ వేదికపైకి వచ్చేశాడు. 

ఇంటి సభ్యులతో బుజ్జి బుజ్జి మాటలతో ముచ్చటించిన సమంత అవినాష్ కోపం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. నేను మనిషినే నాకు కోపం వస్తుంది అన్నాడు అవినాష్. ఇంటి సభ్యులపై హైపర్ ఆది పంచ్ లు హైలెట్ అయ్యాయి. కోపం తగ్గించుకున్నావు కాబట్టే సోహైల్ ఇంటిలో ఉన్నావ్...లేదంటే మీ ఇంటిలో టీవీ ముందు వుండేవాడివి అన్నాడు. ఇక హౌస్ లోని నోయల్ ని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ గా పోల్చాడు. 

కాగా పాయల్ ఓ ఎనర్జిటిక్ సాంగ్ తో బిగ్ బాస్ వేదికపై దుమ్మురేపింది. వెంకీ మామ చిత్రంలోని కోకో కోలా పెప్సీ...సాంగ్ కి ఆడి పాడింది. పాయల్ ఎంట్రీ ప్రేక్షకులలో మరింత జోష్ నింపడం ఖాయంగా కనిపిస్తుంది. హీరో కార్తికేయ సాహో లోని ఓ సాంగ్ కి డాన్స్ అదరగొట్టాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి తమ పేరెంట్స్ వీడియోలు చూపించి భావోద్వేగానికి గురిచేశారు. 

సింగర్స్, డాన్సర్స్ తో సమంత హోస్టింగ్ తో బిగ్ బాస్ షో నేడు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనుంది. బిగ్ బాస్ తాజా ప్రోమోలో ఈ విషయాలన్నీ చూపించారు. కాగా నేడు ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. లేటెస్ట్ ప్రోమోలో కూడా కేవలం, సరదాలు, సందళ్ళు చూపించారు కానీ ఎలిమినేషన్ గురించి ప్రస్తావించలేదు. నేడు దాదాపు ఎలిమినేషన్ ఉండకపోవచ్చని కొందరు భావిస్తున్నారు. నేడు సాయంత్రం 6గంటలకు బిగ్ బాస్ ప్రసారం కానుంది.