టాలీవుడ్ లో 'ప్రయాణం', 'ఊసరవెల్లి'  సినిమాలతో పేరు తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ ఘోష్ తాను డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు తెలియచేసింది. సోషల్ మీడియాలో ఈ విషయమై పోస్ట్ పెట్టిన ఆమె తను ఐదు సంవత్సరాలుగా డిప్రెషన్ తో ఇబ్బందిపడుతూ మెడిసన్స్ తీసుకుంటున్నాను అన్నారు. అలాగే తనకు పానిక్ ఎటాక్స్ వచ్చినప్పుడు తన స్నేహితులకు, ఫ్యామిలీ మెంబర్స్ కు ఫోన్ చేసి సాయం కోరుతానని, డిప్రెషన్ నుంచి బయిటపడతానని అన్నారు.

ఈ విషయాలన్ని సోషల్ మీడియాలో చెప్తూ ..మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి ప్రస్దావించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం విషయమై ఆమె చాలా బాధపడుతూ,డిస్ట్రబ్ అయ్యానని అన్నారు. అలాగే తన ఫాలోవర్స్ ని కూడా మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా ఎప్పటకప్పుడు గమనించుకోవాలని, ఏదైనా సాయిం అవసరమైతే కుటుంబాలని, స్నేహితులను అడగాలని సూచించారు.
 
గత కొద్దిరోజులుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె రీసెంట్ గా వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లింది. దీంతో పాయల్‌కు కరోనా వచ్చిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఆ వార్తలపై స్పందించింది పాయల్. ‘‘గత కొద్ది రోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాట నిజమే. ముందుగా తలనొప్పి ప్రారంభమై అతర్వాత జ్వరం వచ్చింది. ఇది కరోనా కాదని నాకు కచ్చితంగా తెలుసు. అయితే నా కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రం ఆందోళనకు గురయ్యారు.

 దీంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించగా.. మలేరియా జ్వరం అని తేలింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపెడుతున్న కరోనా వైరస్‌ త్వరలోనే ముగుస్తుందని బలంగా నమ్ముతున్నా. అతి త్వరలోనే మనమందరం మునపటి సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తామని నమ్ముతున్నాను’’.. అంటూ వివరణ ఇచ్చింది పాయల్ ఘోష్.