Asianet News TeluguAsianet News Telugu

మోదీ గారూ.. ఆ డైరక్టర్ లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి

తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌ చిత్ర నిర్మాత, దర్శకుడు  అనురాగ్‌ కశ్యప్‌ తనపై లైంగిక దాడి చేశారంటూ ఆరోపించారు.  తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీని కోరారు. 
 

Payal Ghosh appeals to PM Modi for action against Anurag Kashyap
Author
Hyderabad, First Published Sep 20, 2020, 7:47 AM IST


‘‘ప్రయాణం’, ‘ఊసరవెల్లి’, ‘మిస్టర్‌ రాస్కెల్‌’ చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలోనూ గుర్తింపు తెచ్చుకున్న  హీరోయిన్‌ పాయల్‌ ఘోష్‌. తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌ చిత్ర నిర్మాత, దర్శకుడు  అనురాగ్‌ కశ్యప్‌ తనపై లైంగిక దాడి చేశారంటూ ఆరోపించారు.  తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని మోదీని కోరారు. 

శనివారం ఆమె ట్విట్టర్‌లో..‘అనురాగ్‌ కశ్యప్‌ నాపై చాలా తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. నరేంద్ర మోదీజీ.. ఈ విషయంలో చర్య తీసుకోండి. కశ్యప్‌లోని రాక్షస కోణాన్ని ప్రజలకు చూపెట్టండి. ఇలా వెల్లడించడం నాకు హాని చేస్తుందని, నా భద్రతకు ముప్పు అని నాకు తెలుసు. సాయం చేయండి’ అని కోరారు.

దీనిపై జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ స్పందించారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే తాము చర్య తీసుకుంటామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఆమె ఆరోపణ ఏమిటంటే...అవకాశాల కోసం నేను ప్రయత్నిస్తున్న సమయంలో నన్ను అనురాగ్ కశ్యప్ తన రూమ్‌కు రమ్మని చెప్పారు. ఆయన ఇంటికి వెళితే నన్ను అసభ్యంగా తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. తాను రెండు సార్లు తనతో దారుణంగా ప్రవర్తించారు. ఆయన రూమ్‌లో డ్రగ్స్ ఉండటం చూశాను. కరణ్ జోహర్, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లు నాకు క్లోజ్ అని చెప్పి నన్ను బలవంతంగా లోబరుచుకోవాలని చూశాడు అని పాయల్ ఘోష్ అన్నారు.

 పటేల్‌కి పంజాబీ బీబీ అనే సినిమాలో, నిభానా సాథియా అనే టీవీ కార్యక్రమంలో పాయల్‌ ఉన్నారు. ఇప్పటికే నటి కంగనా రనౌత్, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో పాయల్‌ ఘోష్‌ ఆరోపణలపై కంగనా మద్దతు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios