తమ్ముడి కోసం చిరంజీవి వస్తున్నాడు!

తమ్ముడి కోసం చిరంజీవి వస్తున్నాడు!

టాలీవుడ్ లో మెగాహీరోల సంఖ్య పెద్దదనే చెప్పాలి. ఒక మెగాహీరో సినిమా ఫంక్షన్ జరిగితే అక్కడకు మిగిలిన మెగాహీరోలు కూడా వచ్చి ప్రోత్సహిస్తుంటారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం తన అన్నయ్య చిరంజీవి 'అజ్ఞాతవాసి' ఆడియో ఫంక్షన్ కు రాబోతున్నాడని సమాచారం. నిజానికి ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేసి సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. అయితే ఇప్పుడు సినిమా ఆడియో వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న హైదరాబాద్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. అయితే ఈ ఆడియో వేడుకకు అతిథిగా ఎవరు హాజరు కానున్నారనే విషయంలో చిరంజీవి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీని వెనక రాజకీయా కారణాలున్నాయంటున్నారు. ప్రజారాజ్యం ప్రయోగాన్ని ఈ మధ్య  పవన్ ప్రశంసించారు.దీనిని రెసిప్రొకేట్ చేసేందుకు మెగస్టార్ ఈ పంక్షన్ కు వస్తున్నాడని వినపడుతూ ఉంది.

చిరంజీవి స్వయంగా తమ్ముడిని ఆశీర్వదించడానికి ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడని తెలుస్తోంది. గతంలో పవన్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా ఈవెంట్ కు కూడా చిరంజీవిని అతిథిగా పిలిచి ఆయన పట్ల తన భక్తిని చాటుకున్నాడు పవన్. ఇప్పుడు తమ్ముడి కోసం చిరు ఆడియో వేడుకకు రాబోతున్నాడనేది తాజా సమాచారం. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకేవేదికపై కనిపించనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమంలో వీరేం మాట్లాడతారో వినాలనే ఆసక్తి ప్రతిఒక్కరిలో కలుగుతోంది. ఈ  మధ్య తన ఉత్తరాంధ్రలో పవన్  అన్నయ్యను బాగా సపోర్టు చేశారు. ప్రజారాజ్యం ప్రయోగం విఫలమయ్యేందుకు కొంత మంది వ్యక్తులు కారణమని, వారిని వదలన్నారు.  ఇలా పవన్ మాట్లాడటం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో పవన్ వొంటరి కాదు, పవన్ పోరాటానికి ఆన అండ ఆశీస్సులంటాయని  చెప్పి ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చేందుకు  మెగా స్టార్ వస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినపడుతూ ఉంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos