వైరల్ అవుతున్న పవన్ చిన్ననాటి ఫోటో

pawan shares his childhood memories pic
Highlights

వైరల్ అవుతున్న పవన్ చిన్ననాటి ఫోటో

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌ తన చిన్ననాటి ఫొటో పోస్ట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంటును ప్రధానంగా రాజకీయాల కోసమే ఉపయోగిస్తుంటాడు. వ్యక్తిగత విశేషాలు.. సినిమాల సంగతుల గురించి ఇందులో పంచుకోవడం చాలా అరుదు. ఐతే నిన్న పవన్ నోస్టాల్జిక్ గా అనిపించే వ్యక్తిగత ఫొటో ఒకటి ట్విట్టర్ లో పంచుకుని ఆశ్చర్యపరిచాడు. అందులో పవన్ అన్నయ్యలు చిరంజీవి.. నాగబాబులతో పాటు అతడి ఇద్దరు సోదరీమణులు కూడా ఉండటం విశేషం. అది ఈనాటి ఫొటో కాదు. దాదాపు నాలుగు దశాబ్దాల కిందటిది. పవన్ అప్పటికి ఏడో క్లాసులో ఉన్నాడు. నెల్లూరులో ఏడో తరగతి చదువుకుంటున్నపుడు తీసిన ఫొటో అదని పవన్ వెల్లడించాడు. చిరు నలుపు చొక్కాలో.. నాగబాబు తెలుపు చొక్కాలో మెరిసిపోతున్నారందులో. చిరు అప్పటికే హీరోగా రాణిస్తున్నాడు అప్పటికి.

నిక్కరు.. చొక్కా వేసుకున్న పవన్ అందులో చాలా డల్లుగా కనిపిస్తున్నాడు. అందుకు కారణం లేకపోలేదు. తాను శ్వాసకోశ సంబంధిత వ్యాధి నుంచి అప్పుడే కోలుకున్నానని తెలిపారు.ఈ ఫొటో మెగా అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. అసలెప్పుడూ వ్యక్తిగత విశేషాలు ట్విట్టర్ లో పంచుకోని పవన్.. ఇలా తన చిన్ననాటి ఫొటోను షేర్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.  పవన్‌ పోస్ట్ చేసిన ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. కాగా, ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నంలో పర్యటిస్తూ తన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నారు.         

loader