'వకీల్ సాబ్': పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ టైమ్ అంత తక్కువా? నమ్మచ్చా?
పవన్ కళ్యాణ్ కోసం పింక్ స్క్రిప్ట్ లో మార్పులు చేసామని చెప్పారు. అంటే ఖచ్చితంగా పవన్ అమితాబచ్చన్ పింక్ సినిమాలో కనిపించే టైం కన్నా వకీల్ సాబ్ లో పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువుండాలి.
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీతో వస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. అసలే పవన్ కళ్యాణ్.. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ తెరపై కనిపించబోతున్నారు. ఇక ఆయనను మళ్లీ అలా చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఓ పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో పవన్ కనిపించనున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. 'వకీల్ సాబ్' చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. సెన్సార్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవడంతో ఇక ప్రేక్షకుల ముందుకు రావడమే మిగిలుంది. ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో పవన్ పాత్ర తెరపై ఎంత సేపు కనపడనుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఇక బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రలో వచ్చిన 'పింక్' చిత్రాన్ని తెలుగు నేటివిటీకి, పవన్ ఇమేజ్ కు తగిన విధంగా మార్పులు చేసి 'వకీల్ సాబ్' గా రీమేక్ చేశారు. అయితే బాలీవుడ్ పింక్ సినిమా చూస్తే అమితాబచ్చన్ హీరోయిజం అంతగా కనిపించదు. సినిమా అంతా హీరోయిన్స్ చుట్టూనే తిరుగుతుంది. అమితాబ్ కనపడే సమయం కూడా తక్కువే. అయితే పింక్ రీమేక్ వకీల్ సాబ్ కి వచ్చేసరికి సినిమా చాలావరకు పవన్ పాత్రకు ప్రయారిటీ ఇచ్చామని దర్శకుడు వేణు శ్రీరామ్ చెబుతున్నారు.
అలాగే పవన్ కళ్యాణ్ కోసం పింక్ స్క్రిప్ట్ లో మార్పులు చేసామని చెప్పారు. అంటే ఖచ్చితంగా పవన్ అమితాబచ్చన్ పింక్ సినిమాలో కనిపించే టైం కన్నా వకీల్ సాబ్ లో పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువుండాలి. కాబట్టే పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించిన టాపిక్ ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు.
ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడేదాన్ని బట్టి... వకీల్ సాబ్ సినిమా మొదలయ్యాక కాసేపటికే...పవన్ ఓ పవర్ ఫుల్ యాక్షన్ సీన్ ద్వారా ఎంట్రీ ఇస్తాడని, ఆ సీన్ అదిరిపోతుందని చెప్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ వకీల్ సాబ్ లో 45 మినిట్స్ మాత్రమే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా పవన్ కళ్యాణ్ తో 45 డేస్ వర్క్ చేశానని చెప్పటం వల్లే పవన్ స్క్ర్రీన్ టైమ్ తక్కువ అనే అంచనాకి వచ్చి ప్రచారం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. దానికి తోడు మొదటి నుంచీ కేవలం 45 డేస్ కి పవన్ కళ్యాణ్ కి 50 కోట్ల రెమ్యునేషన్ ని దిల్ రాజు ఇచ్చినట్లుగా ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న వార్త. ఏదైమైనాపవన్ కళ్యాణ్ ని బిగ్ స్క్రీన్ ఎంత సేపు చూసాము అనేదాని కన్నా ...ఎంత అద్బుతంగా చూసాము అనేదే... పవన్ ఫాన్స్ కు సంతోషం కలిగించే విషయం.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ కాగా... కీలకపాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్ నటించారు. తమన్ సంగీతం అందించిన 'వకీల్ సాబ్' పాటలకు విశేషమైన ప్రజాదరణ లభిస్తోంది. హైదరాబాదు శిల్పకళావేదికలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకుంది.