గూస్‌బమ్స్ అప్‌డేట్‌ః చరణ్-శంకర్ సినిమాలో పవన్, సల్మాన్, విజయ్ సేతుపతి, సుదీప్?
తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో సినిమాని తెరకెక్క బోతున్న రామ్‌చరణ్- శంకర్ చిత్రంలో చరణ్‌తోపాటు నలుగురు సూపర్‌స్టార్లు నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వార్త ఫ్యాన్స్ లో గూస్‌బంప్స్ క్రియేట్ చేస్తుంది.
శంకర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ నటిస్తున్న 15వ చిత్రమిది. దిల్‌రాజు దీన్ని ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో సినిమాని తెరకెక్కించబోతున్నారట. అయితే ఇందులో రామ్‌చరణ్‌తోపాటు నలుగురు సూపర్‌స్టార్లు నటించబోతున్నట్టు తెలుస్తుంది.
కీలక పాత్రల్లో ఆయా స్టార్లు మెరిసే అవకాశం ఉందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు వెర్షన్‌లో చిరంజీవిగానీ, పవన్‌నీగానీ నటింప చేసే అవకాశం ఉందని టాక్. అలాగే హిందీలో సల్మాన్‌తో చర్చలు జరుపుతున్నారని, తమిళంలో విజయ్ సేతుపతిని అడుగుతున్నారట. కన్నడలో ఉపేంద్రగానీ, సుదీప్‌ని గానీ తీసుకోవాలనుకుంటున్నారట శంకర్. ప్రస్తుతం వారితో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే, వాళ్లు ఇందులో నటించేందుకు ఒప్పుకుంటే ఈ సినిమాని మించిన ప్రాజెక్ట్ మరోటి లేదని, అత్యంత భారీ సినిమాగా ఇది క్రియేట్ కాబోతుందని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే శంకర్ ఇటీవల తన హిందీ సినిమాని ప్రకటించారు. రణ్‌వీర్ సింగ్‌తో `అపరిచితుడు` రీమేక్‌ని అనౌన్స్ చేశారు. అది రామ్‌చరణ్ సినిమా కంటే ముందే తెరకెక్కే అవకాశం ఉందనే వార్త కూడా వినిపిస్తుంది. ఇదే జరిగితే రామ్‌చరణ్ మరో ఏడాది పాటు ఆగాల్సిందే. మరోవైపు శంకర్.. కమల్‌తో `భారతీయుడు 2` తెరకెక్కించాల్సి ఉంది. కమల్ డేట్స్ ఇస్తే ఆ సినిమా కూడా చేసేందుకు సిద్ధమే అని శంకర్ తెలిపారు. ఈ మూడు ప్రాజెక్ట్ ల్లో శంకర్ ఏ సినిమాని ముందు పట్టాలెక్కిస్తాడనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.
రామ్‌చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కలిసి `ఆర్ఆర్‌ఆర్`లో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. కొంత షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. కరోనా ఉదృతి తగ్గాక అది పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నారు. దీంతోపాటు తండ్రి చిరంజీవితో కలిసి `ఆచార్య`లో కీలక పాత్ర పోషిస్తున్నారు చరణ్. ఇది మే 13న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వాయిదా పడే అవకాశం ఉంది.