Asianet News TeluguAsianet News Telugu

లీక్: పోలీస్ స్టిక్కర్ ని తొలిగిస్తున్న పవన్

కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చిన సంగతి తెలిసిందే.  ఈ చిత్రానికి సంభందించిన సెట్ లో ఫొటో లీక్ అయ్యి ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. నటుడు నుంచి రాజకీయ నాయకుడు మారిన పవన్ ..తన ఐడియాలజీని సెట్స్ మీద కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 

Pawan removes Police sticker from the shield jsp
Author
Hyderabad, First Published Dec 29, 2020, 7:16 PM IST

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన చిత్రం ‘వకీల్ సాబ్’. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చిన సంగతి తెలిసిందే.  ఈ చిత్రానికి సంభందించిన సెట్ లో ఫొటో లీక్ అయ్యి ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. నటుడు నుంచి రాజకీయ నాయకుడు మారిన పవన్ ..తన ఐడియాలజీని సెట్స్ మీద కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 

మీరు ఇక్కడ చూస్తున్న ఫొటో గ్రాఫ్ లో పవన్ కళ్యాణ్ ..షీల్డ్ మీద నుంచి పోలీస్ అనే పదానికి సంభందించిన స్టిక్కర్ ని తీసేస్తున్నారు. ఈ షీల్డ్ ని ఓ యాక్షన్ సీన్ లో పవన్ వాడనున్నారు. తాను పోలీస్ అనే పదాలు రాసి ఉన్న షీల్డ్ ని వాడితే రాంగ్ గా ప్రొజెక్ట్ అవుతుందని తీసేస్తున్నట్లు సమాచారం. పోలీస్ సిస్టమ్ మీద, పోలీస్ అధికారుల మీద తనకు ఉన్న గౌరవంతోనే ఈ స్టిక్కర్ ని తీసేసి యాక్షన్ సీక్వెన్స్ లో వాడబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా మూవీపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘వకీల్ సాబ్’ టీజర్ సిద్ధమైందని.. జనవరి 1న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందంటూ నెట్టింట్లో వార్త హాల్‌చల్ చేస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అటు గత కొద్దిరోజులుగా ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా బయటికి రాకపోవడంతో పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. 2020లో ట్విట్టర్‌లో ‘వకీల్ సాబ్’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios