‘అజ్ఞాతవాసి’ పవన్ ని కాపాడతాడా?

First Published 11, Dec 2017, 11:24 AM IST
Pawan political tour likely to have negative impact on his 2018 movie Agnathavaasi
Highlights

ఇప్పటి ప్రశ్నలు

  • రాజకీయాల్లో పవన్ వాళ్లన్నతమ్ముడే అనుకుని ‘అజ్ఞాతవాసి’ ని అదరిస్తారా. 
  • ఆంధ్ర యాత్ర తెచ్చిన  నెగెటివ్ ఇమేజ్ నుంచి ‘అజ్ఞాతవాసి’  పవన్ ని కాపాడతాడా? .

2018లో విడుదలయ్యే తొలి తెలుగు సినిమా పవన్ కల్యాణ్ దే. జనవరి 10 తేదీన ఆయన ‘అజ్ఞాతవాసి’గా  తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అయితే, ఈ టైటిల్ గతవారం లో పవన్ కల్యాణ్ జరిపిన ఆంధ్రాపర్యటనలో బాగా ట్విస్టయిపోయింది. ఉన్నట్లుండి ఆయన ఉత్తరాంధ్రపర్యటనకు బయలుదేరారు. అది చివరకు ఒంగోలు దాకా సాగింది. అయితే, ఇంతవరకు పవన్ జరిపిన పర్యటనలొకఎత్తు. ఇదొక ఎత్తు. ఈ సారి పవన్ పర్యటన బాగా అపకీర్తి పాలయిందని చెబుతున్నారు.  ఆయన టిడిపి తరఫున యాత్ర చేస్తున్నారని, అసలు రాష్ట్ర ప్రజల కష్టాలన్నింటికి ప్రతిపక్షం వైఫల్యమే కారణన్నట్లు చెప్పేందుకు ఆయన యాత్ర చేస్తున్నారని విమర్శలొచ్చాయి. ఈ విమర్శలలో  ఆయన ‘అజ్ఞాతవాసి’ కూడా చిక్కుకు పోయింది. ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ ఆయన మీద సినిమా టైటిల్ ను ఉపయోగించి దాడిచేశారు. పవన్ ఉపన్యాసాలలో నుంచి ‘అజ్ఞాత వాసి’ కాదు ‘అజ్ఞాన వాసి’ బయటకొస్తున్నాడని అని సినిమా టైటిల్ ను వివాదంలోకి రాగారు. ఈ పర్యటనలో ఆయన భాష, భావం మీద మరొక దెబ్బ పడింది. ఆయన మాట్లాడేది అర్థంకావడంలేదనేది ఆ దెబ్బ. పవన్ కల్యాణ్ ప్రసంగాలను, విమర్శలను ఒక మాటతో కొట్టేస్తూ,  పవన్ దగ్గిర సరుకులేదని ప్రతిపక్ష నేత జగన్  అన్నారు. మరొక దెబ్బ టిడిపిగుంటూరు ఎంపి గల్లా జయదేవ్ వేశారు. ‘అంతాబాగుంది, పవన్ మంచివాడు. ప్రజలకు సేవచేయాలన్న తపన ఉన్నవాడు. అయితే, పాలిటికల్ స్టాండ్ ఏమిటో అర్థంకాలేదు,’ అని అన్నారు.

అందువల్ల పవన్ కు ఈ పర్యటనల్లో జనసైనికుల చప్పట్లు తప్ప మిగిలిన  గుడ్ విల్ ఏమీ లేదు. 

బాగా చెడ్డ నెగటివ్ కాంపెయిన్ జరిగిందనే అనాలి.  టిడిపి ఏజంట్ అనే అపకీర్తి వచ్చింది. ప్రతిపక్షం ఫెయిల్ అయ్యేందుకే యాత్ర చేస్తున్నాడని అందరికితెలిసిపోయింది.ఇలాంటి విశ్లేషణలు జనవరి పది దాకా సాగుతూనే ఉంటాయి. వైసిసి అంతా  ఈజీగా పవన్ ని వదలదు.

ఏదో ఒక ఘన  విజయం ఎదురయితే తప్ప ఈ నెగటివ్ ఇమేజ్ నుంచి బయటపడటం కష్టం. ఈ నేపథ్యంలో అంతా, తొందర్లో రిలీజ్ కానున్న పవన్ సినిమా వైపు చూస్తున్నారు.

అందువల్ల ఈ నెగటివ్ పబ్లిషిటి ‘అజ్ఞాతవాసి’ పడుతుందేమోననే చర్చ చిత్రసీమ వర్గాల్లో మొదలయింది. సినిమా విడుదలకు ముందు సాగిన ఈ యాత్ర పవన్ ఇమేజ్ ఏ మాత్రం పెంచలేదు. ఆ మాటకొస్తే నెగటివ్ ఇమేజ్ తోడయింది. అందుకే చర్చ. తెలుగు ప్రేక్షకులు సినిమా వేరు రాజకీయం వేరనుకుంటారా? రాజకీయాల్లో పవన్ వాళ్లన్నతమ్ముడే అనుకుని సినిమాను మాత్రం అదరిస్తారా.  యాత్ర ఈ నెగెటివ్ ఇమేజ్ నుంచి పవన్ ని కాపాడతాడా? అనేది ఇప్పటి ప్రశ్న. ఏమో నెలరోజులాగుదాం. 

 

 

 

 

loader