ప్రతి ఏడాది ఎదో ఒక సినిమా భారీ అంచనాలతో రిలీజయ్యి ఒక్కసారిగా బొక్కబోర్లా పడటం ఆనవాయితీగా వస్తున్నదే. అయితే గతంలో సినిమాల కంటే ఇప్పటి సినిమాలు భారీ నష్టాల్లో ముంచుతున్నాయి. గత రెండేళ్ల నుంచి చూసుకుంటే టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అందుకున్న హీరోల్లో మన స్టార్స్ నిలిచారు. 

పవన్ కళ్యాణ్ - మహేష్ ల తరువాత ఇప్పుడు బయ్యర్స్ ని ఎక్కువగా దెబ్బ కొట్టింది నందమూరి బాలయ్యే. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ కథానాయకుడు రిలీజ్ కు ముందు ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. 70 కోట్లకు పైగా థ్రియేటికల్ వాల్యూతో బిజినెస్ స్టార్ట్ చేసిన ఈ సినిమా బయ్యర్స్ కి మొదటి రోజు నుంచే షాక్ ఇచ్చింది. 

సినిమాకు రివ్యూలు బాగానే వచ్చినా జనాల అంచనాలను సినిమా అందుకోలేదు. దీంతో రెండవరోజు కూడా కలెక్షన్స్ పెద్దగా రాలేవు. పండగ సీజన్ లో కూడా సినిమాకు షేర్స్ కొంచెం కూడా పెరగలేదు. చూస్తుంటే సినిమా 50 కోట్ల వరకు నష్టాలను మిగిల్చేలా ఉందని సమాచారం. 

ఇక 2017లో ఇదే స్థాయిలో స్పైడర్ సినిమాతో వచ్చిన మహేష్ 55 కోట్ల నష్టాలను మిగిల్చగా 2018లో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి 60 కోట్ల వరకు ముంచేసింది. బయ్యర్స్ కి అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఈ ముగ్గురి హీరోల సినిమాలు టాప్ 3లో నిలిచాయి.